Om Shanti Shanti Shantihi Teaser: ధోనీ ముంబై ఇండియన్స్ కాదా.. ఎప్పుడు మారిపోయాడు
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:52 PM
డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)r హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ఓం శాంతి శాంతి శాంతిహి (Om Shanti Shanti Shantihi ).
Om Shanti Shanti Shantihi Teaser: డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)r హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం ఓం శాంతి శాంతి శాంతిహి (Om Shanti Shanti Shantihi ). ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ శనివరపు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ సరసన ఈషా రెబ్బ (Eesha Rebba) నటిస్తోంది. 2022 మలయాళంలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jayahe) సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఓం శాంతి శాంతి శాంతిహి చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. అంబటి ఓంకార్ నాయుడిగా తరుణ్ భాస్కర్ నటిస్తుండగా.. కొండవీటి ప్రశాంతి పాత్రలో ఈషా నటిస్తుంది. ఓంకార్ నాయుడుకు కొంచెం కోపం ఎక్కువ. చేపల వ్యాపారం చేస్తూ ఇంటిని ఒక్కడే నడుపుతూ ఉంటాడు. ప్రశాంతికి ఇండిపెండెంట్ గా బతకడం ఇష్టం. కానీ, తండ్రి ఎక్కువ కొడుకునే బాగా చూసుకోవడంతో ఎప్పటికైనా ఒక్కదాన్నే ఎదగాలని చూస్తుంది. వీరిద్దరికీ పెద్దలు పెళ్లి చేస్తారు. పెళ్లి తరువాత వీరిద్దరి జీవితాల్లో జరిగిన సంఘటనల సమూహారమే సినిమా.
మలయాళంలో జయ జయ జయ జయహే సినిమాతోనే బాసిల్ జోసెఫ్ కి, దర్శన రాజేంద్రన్ కి మంచి పేరు వచ్చింది. మహిళా సాధికారిత, పురుష అహంకారంకు మధ్య జరిగే పోరే ఈ సినిమా అని చెప్పొచ్చు. ఇక తరుణ్, ఈషా ఆ పాత్రలకు చక్కగా సరిపోయారు అని చెప్పొచ్చు. ఇక మిగతా పాత్రల్లో కూడా పెద్ద నటులనే తీసుకోవడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. టీజర్ ని కట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. ఇక జై క్రిష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ప్రెష్ గా అనిపిస్తుంది. తెలుగులో ఆల్రెడీ ఒరిజినల్ సినిమా చూసినా కూడా ఈ సినిమా టేకింగ్ కొత్తగా ఉన్నట్లు కనిపిస్తుంది. జనవరి 23 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో తరుణ్ - ఈషా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.