Guns N Roses: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. థియేటర్‌లో శవాలు లేగడం ఖాయమట..
ABN, Publish Date - Sep 15 , 2025 | 07:37 PM
'ఓజీ' చిత్రానికి సంబంధించి ఏ ప్రచార చిత్రం విడుదల చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హంగ్రీ చీతా, సువ్వి సువ్వి, ఫైర్ స్ట్రామ్, ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే!
'ఓజీ' చిత్రానికి సంబంధించి ఏ ప్రచార చిత్రం విడుదల చేసినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హంగ్రీ చీతా, సువ్వి సువ్వి, ఫైర్ స్ట్రామ్, ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి సోషల్ (Pawan Kalyan) మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిందే! ఆ తుఫాను నుంచి తేరుకోకముందే ‘గన్స్ ఎన్ రోజెస్’ అనే మరో సంచలన గీతాన్ని విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అద్వితీయ, హర్ష సాహిత్యం అందించిన ఈ పాటకు తమన్ థియేటర్లు దద్దరిల్లిపోయేలా సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ సాంగ్ ‘ఓజీ’లోని యాక్షన్- ప్యాక్డ్ ప్రపంచంలోకి లోతుగా తీసుకెళ్లేలా ఉంది. ‘డొక్క చించి డోలు కట్టే యముడంట’ అనే లిరిక్స్ హీరో పవర్‌ని, శాసించే తత్వాన్ని తెలియజేస్తున్నాయి. తమన్ గత పాటల తరహాలోనే ఈ పాటను కూడా మరో ఫైర్ స్ట్రామ్‌లా తీర్చిదిద్దారు. ఉరుములను తలపించే బీట్స్‌తో ‘గన్స్ ఎన్ రోజెస్’ (Guns N ROses) సాంగ్ కథ తీవ్రతను తెలియజేస్తుంది. అయితే ఈ పాట మరెదో కాదు.. ఈ సినిమా నుంచి మొదట విడుదల చేసిన ‘హంగ్రీ చీతా’ పాట, గన్స్ అండ్ రోజెస్’ ఒకటే. ఇందులో ఓ బిట్‌ను ఫస్ట్ గ్లింప్స్‌గా విడుదల చేశారు. ఆ చిన్న బిట్ సాంగ్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ పూర్తి పాట మరో స్థాయిలో మోతెక్కించేలా ఉంది. సోషల్ మీడియా ఫ్యాన్స్ మాత్రం పాటకు ఫిదా అయి తమన్ బేస్ బీట్‌కు థియేటర్‌లో శవాలు లెగాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ పాట అయితే అభిమానుల మదిలో తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటి దాకా ఉన్న అంచనాలు రెట్టింపు చేసేలా కనిపిస్తోంది. అతి త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ కూడా రాబోతుంది. అది మరో స్థాయిలో ఉంటుందని మేకర్స్ చెప్పకనే చెప్పారు. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఓ తుపానులా తెరకెక్కించారు అనడానికి ఇప్పటిదాకా విడుదలైన పాటలు, టీజర్లు నిదర్శనం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కు ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి ఇతర పాత్రధారులు.