OG - Kapil Show: కపిల్‌ షోలో ఫైర్‌ స్ట్రామ్‌ పేలిపోయింది

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:07 PM

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ చిత్రం నుంచి ఇప్పటి దాకా విడుదలైన పాటలు, టీజర్లు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించాయి.

OG Movie


పవన్‌ కల్యాణ్‌(Pavan Kalyan) హీరోగా నటిస్తున్న ‘ఓజీ’(OG) చిత్రం నుంచి ఇప్పటి దాకా విడుదలైన పాటలు, టీజర్లు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించాయి. హంగ్రీ చీతా, ఫైర్‌ స్ట్రామ్‌, (Fire Storm)ఓమీ గ్లింప్స్‌ బయటకు వచ్చిన ప్రతి ప్రచార చిత్రం సినిమాకు హైప్‌ క్రియేట్‌ చేసి అంచనాలు పెంచేస్తున్నాయి. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోనూ ఓజీ ఫీవర్‌ నడుస్తోంది. కపిల్‌ శర్మ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’ (The Great Indian Kapil Show)మిరాయ్‌ టీమ్‌ తేజా సజ్జా, రితికా నాయక్‌, శ్రియ, జగపతిబాబు, పాల్గొన్నారు. సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. షో పూర్తయ్యాక ఫ్లోర్‌లో ‘ఓజీ’ నుంచి ఫైర్‌ స్ర్టామ్‌  సాంగ్‌ను ప్లే చేశారు. ఒక్కసారిగా కపిల్‌శర్మతో కలిసి మిరాయ్‌ టీమ్‌తో స్టూడియో దద్దరిల్లిపోయేలా డాన్స్‌ చేశారు. జగపతిబాబు సైతం కాలు కదిపి పవన్‌ పాటకు డాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ‘బాలీవుడ్‌లో కూడా ఓజీ మంత్రానే నడుస్తోంది. ఫైర్‌ స్ట్రామ్‌ అన్ని చోట్ల హీట్‌ పెంచేసింది. కపిల్‌ షోలో ఓజీ సాంగ్‌ ప్లే కాగానే మిరాయ్‌ టీమ్‌ కాలు కదపకుండా ఉండలేకపోయారు. ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ అన్‌స్టాపబుల్‌ అన్నట్లు ఉంది’ అని ఎక్స్‌లో అభిమానులు షేర్‌ చేశారు.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రమిది. ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఇమ్రాన్‌ హస్మీ విలన్‌గా నటిస్తున్నారు. అర్జున్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రియా రెడ్డి కీలక పాత్రధారులు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.


Updated Date - Sep 13 , 2025 | 01:33 PM