సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Goat Song: బ్యాచిలర్ బ్యూటీ ప్రేమలో మునిగితేలుతున్న సుడిగాలి సుధీర్

ABN, Publish Date - Nov 19 , 2025 | 10:19 PM

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), దివ్యభారతి(Divyabharathi) జంటగా మొగుళ్ళ చంద్రశేఖర్, జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ నిర్మించిన చిత్రం గోట్ (Goat).

GOAT

Goat Song: సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), దివ్యభారతి(Divyabharathi) జంటగా మొగుళ్ళ చంద్రశేఖర్, జైశ్నవ్ ప్రొడక్షన్, మాహాతేజ క్రియేషన్స్ నిర్మించిన చిత్రం గోట్ (Goat). మొదట ఈ సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. కొన్ని కారణాల వలన అతను వైదొలగడంతో నిర్మాతనే ఈ సినిమాను పూర్తిచేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా తెరకెక్కిన గోట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా మరో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఒడియమ్మ అంటూ సాగే ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ లాంచ్ చేశాడు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కు అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ వాయిస్ మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఇక సురేష్ బనిసెట్టి లిరిక్స్ హీరో ఎమోషన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాయి.

లిరిక్స్ కి తగ్గట్టే దివ్యభారతి అందం నెక్స్ట్ లెవెల్. సుధీర్, దివ్యభారతి జంట చాలా ఫ్రెష్ గా అనిపించింది. సుధీర్ మాస్ లుక్ లో కనిపించగా.. దివ్యభారతి చాలా క్లాస్ గా కనిపించింది. విజువల్స్ ప్లజెంట్ గా వున్నాయి. ఈ లవ్ ట్రాక్ అందరికీ ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. మొత్తానికి సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్ అయ్యేలానే ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఈ సినిమాతో సుధీర్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Updated Date - Nov 19 , 2025 | 10:19 PM