Vijay Devarakonda: ఒక‌దాన్ని మించి మ‌రోటి .. అస‌లేం ఫ్లాన్ చేస్తున్నావ్ సామీ!

ABN , Publish Date - May 09 , 2025 | 05:39 PM

జ‌య‌ప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ విజ‌య్. ఈరోజు ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రాబోవు సినిమాల పోస్ట‌ర్స్ విడుద‌ల చేశారు.

viajy

జ‌య‌ప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda). గ‌త చిత్రం ఫ్యామిలీ స్టార్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ త్వ‌ర‌లో రాబొతున్న కింగ్డ‌మ్ సినిమాపై భారీ అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన కింగ్డ‌మ్ టీజ‌ర్, పాట‌లు మూవీపై హైప్స్ పెంచుతున్న నేప‌థ్యంలో రెండు మూడు రోజుల్లో సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా ప్రారంభించ‌బోతున్నారు. సితార బ్యాన‌ర్‌లో వ‌స్తున్న‌ కింగ్డ‌మ్ చిత్రం మే30న థియేట‌ర్ల‌లోకి రానుంది.

GqgJfY_XAAAtoXM.jpeg

ఇదిలాఉండ‌గా శుక్ర‌వారంం ఈ రోజు (మే 9) విజ‌య్ దేవ‌ర‌కొండ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న త‌దుప‌రి సినిమాల‌కు సంబంధించి రెండు ఆస‌క్తిక‌ర‌మైన అప్డేట్స్ వ‌చ్చాయి. అందులో మొద‌టిది దిల్ రాజు శ్రీవేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్ (Sri Venkateswara Creations) బ్యాన‌ర్‌పై #SVC59 మూవీ రౌడీ జ‌నార్ధ‌న్‌ చిత్రం కాగా మ‌రోటి మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) బ్యాన‌ర్‌పై నిర్మాణం కానున్న సినిమా. వీటిలో దిల్ రాజు నిర్మించే సినిమాకు రాజావారు రాణి వారు ఫేం ర‌వి కిర‌ణ్ కోల (Ravi Kiran Kola) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మైత్రీ సినిమాకు ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాల డైరెక్ట‌ర్ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

GqgF-q9W8AA5rim.jpeg

తాజాగా విడుద‌ల చేసిన ఈ రెండు సినిమాల ఫ‌స్ట్ లుక్స్ చూస్తే మెస్మ‌రైజింగ్‌గా ఉండ‌గా షూటింగ్ పూర్త‌వ‌క‌ ముందే ఓ రేంజ్‌లో హైప్ తీసుకు వ‌చ్చేలా ఉన్నాయి.పైగా ఈ సినిమాలు ఒక‌దానితో మ‌రోటి సంబంధం లేని జాన‌ర్ చిత్రాలుగా క‌నిపిస్తుండ‌డంతో పాటు విజ‌య్ పాత్ర‌లు కూడా భిన్నంగా ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. విజ‌య్ రాహుల్ కాంబోలో వ‌స్తున్న #VD14 మూవీ పిరియాడిక్ యాక్ష‌న్ చిత్రం కాగా దానికి The GODS gave him STRENGTH. War gave him a PURPOSE అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఇక విజ‌య్ ర‌వి కిర‌ణ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం రూర‌ల్ యాక్ష‌న్ మూవీగా తెర‌కెక్కుతుండ‌గా His Rage Is Romance! Love Is Violence! అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.

Updated Date - May 09 , 2025 | 05:40 PM