Andhra King Taluka: నువ్వుంటే చాలే.. రామ్ రాసిన పాట విన్నారా
ABN, Publish Date - Jul 18 , 2025 | 05:31 PM
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం తన ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకా మీదనే పెట్టుకున్నాడు.
Andhra King Taluka: ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం తన ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకా మీదనే పెట్టుకున్నాడు. గత కొన్నేళ్లుగా రామ్ విజయం కోసం పరితపిస్తున్నాడు. ఇప్పటికీ అతనికి ఒక మంచి విజయం దక్కలేదు. ఇక ప్రస్తుతం రామ్ నటిస్తున్న చిత్రాల్లో ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) ఒకటి. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా నుంచి గత మూడు రోజుల క్రితం మొదటి సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించడం ఒక ఎత్తు అయితే మొట్టమొదటిసారి రామ్.. రచయితగా మారి ఈ సాంగ్ కు లిరిక్స్ అందించడం విశేషం. నువ్వుంటే చాలే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సాంగ్ మొత్తం ప్రేమతో నిండిపోయింది. మొదటిసారి అమ్మాయి ప్రేమలో పడిన అబ్బాయికి ప్రపంచం మొత్తం ఎంత అందంగా కనిపిస్తుందో.. ఆమె పక్కన ఉంటే అన్ని ఉన్నట్లు.. లేకపోతే శూన్యం మిగిలినట్లు అనిపిస్తుంది.
ఇక ఒక ప్రేమికుడు మనసులోని భావాలను మొత్తం రామ్ బయటపెట్టాడు. ఒక ప్రొఫెషనల్ లిరిసిస్ట్ రాసినట్టే రామ్ రాశాడు. ఈ సాంగ్ విన్నాకా రామ్ లో ఇంత గొప్ప టాలెంట్ ఉందా అని అనిపించక మానదు. రామ్ లిరిక్స్ కు తగ్గట్టు ఈ సాంగ్ ను తన వాయిస్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు అనిరుధ్. విజువల్స్ పరంగా కూడా ఎంతో ఆకట్టుకుంది. రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. లవర్స్ గా పార్క్ లు, బీచ్ లు, ఎగ్జిబిషన్ ఇలా అన్నింటికి తిరుగుతూ కనిపించారు. రామ్ న్యూ లుక్ చాలా బావుంది. మొత్తానికి మొదటి సాంగ్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Vijay Devarakonda: స్టంట్స్ చేసింది విజయ్ కాదా..
Director Vassishta: విశ్వంభర స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్.. కథేంటంటే