Dragon: అదేంటి అది.. మొన్నే అవుట్ ఫుట్ బాలేదన్నారు.. ఇప్పుడు రెండు పార్ట్స్ అంటారేంటి
ABN, Publish Date - Nov 02 , 2025 | 10:04 PM
ఈ మధ్యకాలంలో రెండు పార్ట్స్ అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. కథ ఉన్నా లేకున్నా చివర్లో సెకండ్ పార్ట్ అని వేయడం మొదలుపెట్టారు.
Dragon: ఈ మధ్యకాలంలో రెండు పార్ట్స్ అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. కథ ఉన్నా లేకున్నా చివర్లో సెకండ్ పార్ట్ అని వేయడం మొదలుపెట్టారు. ఇంకొంతమంది అయితే సినిమా నిడివి ఎక్కువ ఉందని మధ్యలో కట్ చేసి రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. బాహుబలి సినిమాతో ఈ ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటికీ ఇదే నడుస్తోంది. ఇలా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమాల్లో ఎక్కువ ప్రభాస్ సినిమాలే ఉన్నాయి.
ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైతం దేవరకు అలాగే చేశారు. నిడివి ఎక్కువ ఉందని, కథను మొత్తం ఒక భాగంలో చెప్పలేకపోతుండడంతో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. దేవర పార్ట్ 1 రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు దేవర 2 సంగతి తెలియలేదు. ఇదే ఇలా ఉంది అంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త చిత్రం డ్రాగన్ కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ నీల్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు టాక్. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మొదటి రెండు షెడ్యూల్స్ పూర్తి కూడా చేసుకున్న ఈ సినిమా అవుట్ ఫుట్ నచ్చలేదని ఎన్టీఆర్.. నీల్ మీద అరిచినట్లు వార్తలు వినిపించాయి.
మైత్రీ మూవీ మేకర్స్ మధ్యలో కలుగజేసుకొని నీల్ కి ఎన్టీఆర్ కి మధ్య కొద్దిగా సంధి కుదిర్చారని, ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ ఉత్తర యూరప్ లో జరగనుందని తెలుస్తోంది. నవంబర్ మూడోవారంలో ఆరంభమయ్యే షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయనున్నారట. అయితే తాజగా డ్రాగన్ కు సంబంధించిన ఒక కొత్త వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
సినిమా మొత్తం కలిపి 3 గంటల 40 నిమిషాలు వస్తుందని, దీంతో మొత్తాన్ని రిలీజ్ చేయలేక రెండు భాగాలుగా కట్ చేసి రిలీజ్ చేయాలనీ నీల్ - ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా అన్ని సినిమాల్లా ఒక్కో పార్ట్ కు టైమ్ తీసుకోకుండా రెండు భాగాలను ఒకేసారి షూట్ చేసి నెల గ్యాప్ లో రెండు భాగాలను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఆ ప్రకారమే స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని అంటున్నారు. నిజంగా ఈ వార్త నెటిజన్స్ కి చాలా షాక్ అనే చెప్పొచ్చు. మొన్నటివరకు అవుట్ ఫుట్ బాలేదని, ఇప్పుడు రెండు పార్ట్స్ అంటారేంటి. ఇంకా ఫుల్ స్క్రిప్ట్ అవ్వకుండా 3 గంటల 40 నిమిషాలు ఫుటేజ్ వస్తుందని ఎలా అంటారు అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.