War 2 release: ఎన్టీఆర్‌ను అలా చూపించాలనుకుంటున్నా
ABN, Publish Date - Jul 16 , 2025 | 02:54 AM
ఎన్టీఆర్, హృతిక్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ను తెలుగులో సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో భాగంగా, ‘వార్ 2’ గురించి, ఎన్టీఆర్ కథానాయకుడిగా...
ఎన్టీఆర్, హృతిక్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ను తెలుగులో సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచారంలో భాగంగా, ‘వార్ 2’ గురించి, ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన నిర్మించనున్న చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘వార్ 2’లో ఎన్టీఆర్ పరిచయ సన్నివేశం సినిమాకే హైలైట్. హృతిక్, ఆయన మధ్య వచ్చే ఆ పోరాట ఘట్టాన్ని చూసే తెలుగులో చిత్రాన్ని నేనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాను. హృతిక్, ఎన్టీఆర్ పాత్రలకు సమప్రాధాన్యం ఉంటుంది. ‘రామాయణ’ను ప్రకటించిన తర్వాత దేశమంతా ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాను ‘రామాయణ’ కంటే భారీ స్థాయిలో ప్రకటించాలనుకుంటున్నాం. త్రివిక్రమ్ చేస్తున్న మొదటి మైథలాజికల్ ఇది. సీనియర్ ఎన్టీఆర్‌ను రాముడిగా, కృష్ణుడిగా చూశారు. ఇప్పుడు తారక్‌ను నేను అలా చూపించనున్నాను. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితియార్థంలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా ఆగస్టులో ప్రారంభమవుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పనులు మొదలవుతాయి’’ అని పేర్కొన్నారు.