సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR: నొప్పి ఎక్కువైనా స్పీచ్ ఆపని ఎన్టీఆర్.. రిషబ్ గురించి ఏం చెప్పాడంటే

ABN, Publish Date - Sep 28 , 2025 | 08:50 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కు ఈమధ్యనే చిన్న ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ఒక యాడ్ షూట్ లో ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది.

NTR

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) కు ఈమధ్యనే చిన్న ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ఒక యాడ్ షూట్ లో ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది. చిన్న గాయాలతో బయటపడినా కూడా ఎన్టీఆర్ ఆ నొప్పి నుంచి ఇంకా బయటపడలేదని తెలుస్తోంది. ఆ ప్రమాదం తరువాత మొదటిసారి ఎన్టీఆర్.. కాంతార చాఫ్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే బయటకు వచ్చాడు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కాంతార చాఫ్టర్ 1. అక్టోబర్ 2 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు కాంతార చాఫ్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కు నొప్పి ఉన్నా కూడా వచ్చి రిషబ్ తో తనకున్న స్నేహాన్ని చాటుకున్నాడు. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ నొప్పి ఎక్కువున్నా కూడా స్టేజిపై రిషబ్ గొప్పతనం గురించి మాట్లాడిన తీరు ఆకట్టుకుంటుంది. ' ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కాంతార చిత్ర బృందానికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన నా అభిమాన సోదరులందరికీ నమస్కారాలు. నాకు తెలిసి నా వయస్సు మూడేళ్లు.. నాలుగేళ్లు ఉంటుంది. అప్పుడు మా అమ్మమ్మ మా ఊరు ఇది. ఇక్కడే మేము పుట్టాము అని నాకు చిన్నప్పుడు నుంచే కొన్ని కథలు చెప్పడం మొదలు పెట్టింది. అప్పుడు నిజంగా జరుగుతుందా ఈ కథ నిజమేనా కాదా ? ఇలా ఎన్నో డౌట్లు నాకు. కానీ అవి బాగా నచ్చేవి.


ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది. ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా ఆ పింజుల్లి అంటే ఏంటి..? , గుడి ఘాట్ అంటే ఏంటి.. ? వెళ్ళి చూడాలి కదా అని చిన్నప్పుడు నుంచి నాటుకు పోయింది. కానీ ఏనాడు అనుకోలేదు. చిన్నప్పుడు నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు సినిమా తీస్తాడని. అతను మరెవరో కాదు నా బ్రదర్ రిషబ్ శెట్టి. నేను చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే ఇలా ఐపోతే ఆ కథ తెలియని వాళ్ళు చూసి ఏమయ్యారో అదే కాంతార రిజల్ట్. చాలా అరుదైన దర్శకుడు రిషబ్ సార్. 24 క్రాఫ్ట్ లో ఉండే ప్రతి క్రాఫ్ట్స్ ని ఆయన డామినేట్ చేస్తాడు.


రిషబ్ సారే లేకపోతే నిజంగా ఈ సినిమాని ఈ లెవెల్ లో తీయగలిగేవారా అనిపిస్తుంది.మా అమ్మగారి కోరిక ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్లాలని. రిషబ్ లేకపోతే ఆ దర్శనం అలా అయ్యేది కాదు. ఆ భాగ్యం కలిగేది కాదు. పనులన్నీ మానుకొని కుటుంబ సభ్యులులాగా మాతో వచ్చారు. సొంత కుటుంబ సభ్యులులాగా మమ్మల్ని చూసుకున్నారు. థాంక్యూ చెప్పి ఆయనను దూరం చేయలేను. ఐ లవ్ యూ రిషబ్ సార్.. మా అమ్మ కోరికను తీర్చేలా చేసినందుకు. అక్కడికి వెళ్ళినప్పుడు కాంతార చాప్టర్ 1 కోసం ఆయన ఎంత కష్టపడుతున్నారో చూసే అవకాశం దొరికింది. ఈ సినిమా తీయడం అంత ఈజీ కాదు. ఒక గుడికి తీసుకెళ్లారు నన్ను. నిజానికి ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు. అలాంటి మార్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ సెట్ వేసి ఘాట్ చేస్తున్నారు కాబట్టి.. అక్కడ ఆ మార్గాన్ని వేశారు.


కాంతార రిషబ్ శెట్టి గారి డ్రీమ్. ఈ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేయడానికి హోంబలే ఫిల్మ్స్ సపోర్ట్ చేశారు. ఇండియన్ ఫిలిమ్స్ లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్ చిత్రంగా ప్రస్ఫుటంగా మనందరికీ కనబడాలని మనస్పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి అందరూ రిషబ్ గారిని కాంతార టీమ్ ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మనస్పూర్తిగా నా ధన్యవాదాలు. ఈ స్టేజ్ మీద మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ కూడా ఉంటే బాగుండేది. కాంతార బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అక్టోబర్ 2న తప్పకుండా ధియేటర్ కి వెళ్లి చూడండి. దయచేసి థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. మా రిషబ్ గారికి ఆయన పడిన కష్టానికి మీరందరూ ఆశీర్వాదం అందించండి. అందరికీ థాంక్యూ. ఎక్కువసేపు నిలబడలేకపోతున్నా.. అందుకే ఆపేస్తున్నా అని ముగించాడు.

Akkineni Sobhita: అక్కినేని కోడలు.. సమంతను మరిపిస్తుందిగా

Kayadu Lohar: విజయ్.. నీవి స్వార్ధపూరిత రాజకీయాలు.. కయాదు ఏం చెప్పిందంటే

Updated Date - Sep 28 , 2025 | 08:50 PM