సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు.. బిగ్ షాక్‌: NTR - ప్రశాంత్ నీల్.. సినిమా 'డ్రాగన్' కాదట! రిలీజ్ మ‌రింత‌ ఆల‌స్యం?

ABN, Publish Date - Nov 26 , 2025 | 06:36 AM

యంగ్ టైగర్ యన్టీఆర్ (Jr. NTR) ఫ్యాన్స్ కు అయోమయ పరిస్థితి నెలకొంది. తమ హీరో తరువాతి చిత్రం ఏంటి? ఆ పై వచ్చే సినిమా ఏది? ఇంతకూ ఇప్పుడు నటిస్తున్న మూవీ టైటిల్ ఏంటి? ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయట...

Dragon

తెలుగు చిత్రసీమలో బలంగా వేళ్ళూనుకున్న 'రాజమౌళి సెంటిమెంట్'ను తుడిచేసిన క్రెడిట్ ఆయన ఫస్ట్ హీరో యన్టీఆర్‌కే దక్కుతుంది. రాజమౌళి సినిమాలో నటించి హిట్టు పట్టేసిన ఏ హీరో కూడా తరువాతి చిత్రంతో బంపర్ హిట్ చూడలేదు. అయితే 'ట్రిపుల్ ఆర్' తరువాత యన్టీఆర్ నటించిన దేవర (Devara) మొదట్లో డివైడ్ టాక్ సంపాదించినా, తరువాత పికప్ అయింది. లాభాల బాట పట్టింది. అందువల్ల 'దేవర-2' కూడా తెరకెక్కిస్తామని డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva), యన్టీఆర్ కూడా ప్రకటించారు.

అయితే ఈ సినిమా ఉండబోదని విశేషంగా వినిపిస్తోంది. 'దేవర' ముగింపులోనే కథ అయిపోయిందని, ఇక తరువాత అదే పనిగా 'దేవర-2' తీస్తే అంతగా ఆకట్టుకుంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయట. అందువల్లే 'దేవర' సీక్వెల్ ప్రయత్నాన్ని అటకెక్కించారని వినిపిస్తోంది... ఇది సరైన నిర్ణయమే అనీ కొందరు అంటున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడరాదనీ యన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ భావించినట్టు తెలుస్తోంది.

'డ్రాగన్' కాదట.. !

'దేవర' సీక్వెల్ లేదన్న విషయం తెలిశాక ఫ్యాన్స్ లో కొందరు నిరాశ చెందిన మాట వాస్తవమే. అయితే యన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గ కథ దొరికితే, ఆ స్థానంలో మరో చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందని కళ్యాణ్ రామ్ భావించడం కూడా ఫ్యాన్స్ కు సంతృప్తి కలిగిస్తోంది. ప్రస్తుతం యన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నది తమ హీరోకు అర్జెంట్ గా ఓ బంపర్ హిట్ పడాలన్నదే. ప్రశాంత్ నీల్ (Prasanth Neel) డైరెక్షన్ లో యన్టీఆర్ నటిస్తోన్న డ్రాగన్ (Dragon) సినిమా తగిన విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. యన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుంటే ఆ సినిమా టైటిల్ 'డ్రాగన్' కాదన్న మాట కూడా భలేగా హల్ చల్ చేస్తోంది.

మరి టైటిల్ ఏంటో..?

వాస్తవానికి పలు వేదికలపై 'డ్రాగన్' టైటిల్ వినిపించింది. యన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ ను బట్టే ఆ టైటిల్‌ను ఎంచుకున్నారనీ అన్నారు. ఇప్పుడు 'డ్రాగన్' స్థానంలో ఏ పేరు బయటకు వస్తుందో చూడాలి. నవంబర్ చివరి వారంలోనే మొదలు కావలసిన ఈ సినిమా తాజా షెడ్యూల్ డిసెంబర్ లో ఆరంభమవుతుందని వినిపిస్తోంది. డిసెంబర్ - జనవరి మాసాల్లో ఓ భారీ షెడ్యూల్ జరగనుందట. మైత్రీ మూవీమేకర్స్ , యన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ ఏ టైటిల్ తో వస్తుందో కానీ, ఫ్యాన్స్ మాత్రం దీనిపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొదట్లో ఈ సినిమా మార్చిలో రిలీజవుతుందని వినిపించింది. ఫిబ్రవరి, మార్చిలో మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ సాగనుందని తెలుస్తోంది. అందువల్ల ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఛేంజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. మరి యన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ ఏ టైటిల్ తో ఎప్పుడు ఎలా రిలీజవుతుందో చూడాలి.

Updated Date - Nov 26 , 2025 | 06:36 AM