Ntr - War-2: కన్నెర్ర చేశాడు... కాలర్ ఎగరేశాడు...
ABN, Publish Date - Aug 11 , 2025 | 05:08 PM
‘టెంపర్’ సినిమా ఆడియో వేడుకలో ఇకపై అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఉండే చిత్రాలే చేస్తానని కాలర్ ఎగరేసి తారక్ మాటిచ్చారు. తాజాగా మరో సారి ఆయన కాలర్ ఎగరేశారు.
‘టెంపర్’ (Temper) సినిమా ఆడియో వేడుకలో ఇకపై అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఉండే చిత్రాలే చేస్తానని కాలర్ ఎగరేసి తారక్ (Ntr coller) మాటిచ్చారు. తాజాగా మరో సారి ఆయన కాలర్ ఎగరేశారు. ఆయన బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్-2’ (war 2) హృతిక్ రోషన్ కథానాయకుడు. తారక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై తారక్ అభిమానులపై మండిపడ్డారు. కన్నెర్రజేసి వేదిక నుంచి వెళ్లిపోనా అని మండిపడ్డారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. హృతిక్ రోషన్ స్పీచ్ పూర్తి కాగానే తారక్ మైక్ అందుకున్నారు. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అల్లరి చేయొద్దని, కేకలు వేయవద్దని ఆయన ముందే చెప్పారు. అయినా సరే మధ్య ఓ మధ్యలో అభిమానులు కేకలు, ఈలలు వేశారు. అలాగే జై బాలయ్య అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే తారక్ ఒక్కసారిగా కోపాడానిక గురయ్యారు. బ్రదర్ వెళ్లిపోనా? నాకు ఒక్క క్షణం పట్టుది వెళ్లిపోవడానికి! మాట్లాడే వరకే కాస్త తట్టుకోండి’ అని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఎప్పుడూ బాబాయ్ బాలయ్య అంటూ గుర్తు చేసుకునే తారక్ ఈసారి జై ఎన్టీఆర్, జై హరికృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
కాలర్ ఎగరేశాడు..
టెంపర్ తర్వాత మరోసారి తారక్ కాలర్ ఎగరేశారు. ఒకటి కాదు ఏకంగా రెండుసార్లు కాలర్ ఎగరేశారు. అంటే సినిమా మీద ఆయన అంత నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది. తారక్ స్పీచ్‌లో ఒక్కసారిగా సినిమాకు హైప్ వచ్చేసింది. సినిమాపై ఉన్న నెగిటివిటి మొత్తాన్నీ మార్చేశాడు. ఎవరేమనుకున్న కాలర్ ఎగరేసి చెబుతున్నా.. బొమ్మ అదిరిపోయింది’ అని నమ్మకంగా చెప్పారు తారక్.