సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

War2 Event: నాగ‌వంశీ వ్యాఖ్య‌లు.. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌

ABN, Publish Date - Aug 11 , 2025 | 01:45 PM

సితార నాగ‌వంశీ త‌న సినిమాల విడుద‌ల స‌మ‌యంలో ఇంట‌ర్వ్యూలు, ప్రెస్మీట్ల‌లో మాట్లాడే విధానం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతుంటాయ‌నే విష‌యం తెలిసిందే.

Nagavamshi

సితార నాగ‌వంశీ (Suryadevara Nagavamsi) ప్ర‌తీ సారి త‌న సినిమా విడుద‌ల స‌మ‌యంలో మీడియాకు ఇచ్చే ఇంట‌ర్వ్యూలు, ఆపై ప్రెస్మీట్ల‌లో మాట్లాడే విధానం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతుంటాయ‌నే విష‌యం తెలిసిందే. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల‌లో నిరూపిత‌మైంది కూడా. తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ‘వార్ 2’ ( War 2)ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan), త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు, నాగవంశీ హాజరయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న ర‌జ‌నీకాంత్ కూలీకి పోటీగా భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో తీసుకు వ‌స్తూ ఈ ప్రోగ్రాం నిర్వ‌హించారు.

తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ తన దగ్గరే ఉన్నందున నిర్మాత‌ నాగ‌వంశీ (Suryadevara Nagavamsi) ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతూ పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు .. ఏ మాత్రం బాగోక పోయిన తిట్టడం అలవాటే కదా తిట్టండి, థియేటర్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత అద్భుతం అయినా సినిమా అని మీకు అనిపించక పోతే, మళ్లీ ఎప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడమని అడగను అంటూ ఉత్సాహాం నింపారు. ఆపై తొలి రోజు వార్‌2 కలెక్షన్లు హిందీ వెర్షన్ కంటే ఒక్క రూపాయి అయినా తెలుగులో ఎక్కువ రావాలి, దేవర కంటే పది రెట్లు కలెక్షన్లు రావాలి, అన్న పవర్ ఇండియా అంతా తెలియాలి ఇది ఎన్టీఆర్ అభిమానుల బాధ్యత అంటూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ పరిచేలా ఇంకోర‌కంగా చెప్పుకోవాలంటే రెచ్చ‌గొట్టేలా స్టేజ్‌పైనా మాట్లాడారు.

అయితే ఇప్పుడు ఈ కామెంట్స్‌కి నెటిజన్ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయన స్పీచ్‌ని ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టి సినిమాకి బూస్ట్ ఇవ్వడానికి చేసిన ప్లాన్ అని అంటుంటే, మరికొందరు కలెక్షన్ల కోసం స్టేజీ పైనే ‘అడుక్కుంటున్నారా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు ‘కుబేర’ సినిమా బిచ్చగాళ్ల ట్రైనింగ్ సీన్‌ను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మీ క‌లెక్ష‌న్ల కోసం మ‌మ్మ‌ల్ని, అభిమానుల‌ను వాడుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వార్‌2 సినిమాలో ఎన్టీఆర్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం జ‌రుగుతండ‌డంతో సినిమా ఎలా ఉండ‌బోతుందో అనేది ఇక్క‌డ అభిమానుల‌కు బెంగ ప‌ట్టుకుంది. దీంతో క‌లెక్ష‌న్లు వ‌స్తాయా రావా అనే డౌటానుమానా ల‌తోనే నాగ‌వంశీ ఇలా మాట్లాడుతున్నాడంటూ ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ నిన్ జ‌రిగిన ఈవెంట్‌లో ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీతో పాటు ఎన్టీఆర్ సినిమాలో ఊహించ‌ని ట్విస్టులు ఉంటాయ‌ని, మ‌రిచిపోలేని థ్రిల్ ఈ సినిమా ఇస్తుందంటూ రెండు కాల‌ర్లు ఎగ‌రేసి మ‌రి చెప్ప‌డంతో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోవ‌డం విశేషం.

Updated Date - Aug 11 , 2025 | 01:48 PM