NTR: ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్.. ఎందుకంటే
ABN, Publish Date - Dec 29 , 2025 | 07:38 PM
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపాడు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడే రక్షణాత్మక ఉత్తర్వును మంజూరు చేసినందుకు ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాల జానకి శ్రీనివాసన్ మరియు డాక్టర్ అల్కా డాకర్, రాజేందర్ కి థాంక్స్ చెప్పుకొచ్చాడు.
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపాడు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడే రక్షణాత్మక ఉత్తర్వును మంజూరు చేసినందుకు ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాల జానకి శ్రీనివాసన్ మరియు డాక్టర్ అల్కా డాకర్, రాజేందర్ కి థాంక్స్ చెప్పుకొచ్చాడు. ' నేటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడే రక్షణాత్మక ఉత్తర్వును మంజూరు చేసినందుకు గౌరవనీయులైన ఢిల్లీ హైకోర్టుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్ మరియు డాక్టర్ అల్కా డాకర్, రాజేందర్ మరియు రైట్స్ & మార్క్స్ బృందం వారి అంకితమైన చట్టపరమైన మద్దతుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ స్థిరమైన మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే.. సోషల్ మీడియాలో స్టార్స్ ఫోటోలను, వీడియోలను కొందరు ఇష్టానుసారంగా వాడుతున్నారు. దీనివలన ఆ హీరోల ఇమేజ్ దెబ్బతింటుంది. మార్ఫింగ్ ఫోటోలకు, ఎడిటింగ్స్ కి హీరోల పోటోలను వాడుతూ వారి పరువు తీస్తున్నారు. దీంతో కొందరు సెలబ్రిటీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇకనుంచి తమ పర్మిషన్ లేకుండా ఎవరు తమ ఫోటోలను వాడకుండా ఉండేలా ఉత్తర్వులను జారీ చేయాలనీ కోరారు. చిరంజీవి, నాగార్జున ఇలా చాలామంది కోర్టుకు వెళ్లి తమ ఇమేజ్ పోకుండా కాపాడుకున్నారు. ఈమధ్యనే ఎన్టీఆర్ కి సైతం హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో ఆయన ఈ విధంగా ధన్యవాదాలు తెలిపాడు.
ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ లాగేసుకున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.