NTR: ఎన్టీఆర్ చేతికి రోలెక్స్.. రేటు తెలిస్తే గుండె పగుల్స్

ABN , Publish Date - Nov 07 , 2025 | 09:23 PM

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ (NTR).. బయట కనిపించక చాలా రోజులైంది. రీసెంట్ గా సోషల్ మీడియా అంతటా తానే మోస్ట్ డిబేటబుల్ టాపిక్ అయ్యాడు.

NTR

NTR: మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ (NTR).. బయట కనిపించక చాలా రోజులైంది. రీసెంట్ గా సోషల్ మీడియా అంతటా తానే మోస్ట్ డిబేటబుల్ టాపిక్ అయ్యాడు. అందుకు కారణం.. ఎన్టీఆర్ ధరించిన ఓ లగ్జరీ వాచ్. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లోని ప్రముఖ వాచ్ షోరూమ్‌ వెళ్లిన తారక్, అక్కడ రోలెక్స్ బ్రాండ్ కలెక్షన్‌ను పరిశీలించాడు. ఓ అరుదైన మోడల్ వాచ్ ను కొనుగోలు చేయడమే కాకుండా దానిని చేతికి ధరించి ఫోటోలకు పోజులిచ్చాడు. ఇంకేముంది ఆ వాచ్ తో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.

ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ విలువ తెలిస్తే కచ్చితంగా గుండె పగులుతుంది. ఎంత అనుకుంటున్నారా.. ఆ వాచ్ విలువ ఏకంగా రూ.2.2 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇది రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా లే మాన్స్ స్పెషల్ ఎడిషన్ మోడల్. అసలు దీని బేస్ ప్రైస్ రూ.45 లక్షల పైచిలుకు ఉంటుంది కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారీ డిమాండ్ కారణంగా రీసేల్ మార్కెట్‌లో ధర ఆకాశాన్నంటింది. ఈ మోడల్ ప్రత్యేకత ఏమిటంటే, రేసింగ్ హిస్టరీకి సంబంధించిన డిజైన్ ఎలిమెంట్స్, హై-ఎండ్ మెటీరియల్స్ , లిమిటెడ్ ప్రొడక్షన్ కాంబినేషన్. ఎన్టీఆర్ ఈ వాచ్‌ను చేతికి ధరించి ఫొటోలు తీయించుకోవడంతో అది మరింత హైలైట్ అయ్యింది.

వాచ్‌లంటే ఎన్టీఆర్‌కు ప్రత్యేక అభిమానం. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను బట్టల కంటే వాచ్‌లు సేకరించడం ఎక్కువ ఇష్టపడతానని.. అరుదైన పీస్‌లను కలెక్ట్ చేసి తన పిల్లలకు అందించాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఇప్పుడు ఈ రోలెక్స్ కూడా అతని కలెక్షన్‌లో చేరడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. ఇక సినిమాల అప్డేట్ విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న డ్రాగన్ మూవీ షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.. ఇలా ఒకేసారి రెండు విశేషాలతో హాట్ టాపిక్ అయ్యాడు ఎన్టీఆర్. మరి డ్రాగన్ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Akhanda 2: అఖండ తాండవం ప్రోమో వచ్చేసిందిరోయ్..

Samantha: బాయ్ ఫ్రెండ్ బిగి కౌగిలిలో సమంత.. సాహసోపేతమైన అడుగు అంటూ పోస్ట్

Updated Date - Nov 07 , 2025 | 09:23 PM