Nivetha Pethuraj: స్నేహితుడు.. ప్రియుడిగా ఎలా మారాడంటే..
ABN, Publish Date - Aug 31 , 2025 | 05:27 PM
నటి నివేదా పేతురాజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. తనకు కాబోయేవాడితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. తనకు కాబోయేవాడితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసి అభిమానులు, నెటిజన్లు (Rajhith Ibran) ఇద్దరికీ నిశ్చితార్థం అయిపోయిందని భావిస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు నివేదా పేతురాజు. ఇంకా ఎంగేజ్‌మెంట్ కాలేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. అక్టోబరులో నిశ్చితార్థం చేసుకుని, వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకోబోతున్నామని తెలిపింది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదని అన్నారు. సింపుల్‌గానే పెళ్లి తంతు ఉంటుందని ఆమె చెప్పారు.
అలాగే తన ప్రియుడితో పరిచయం ఎలాగ అన్నది తెలిపింది. ‘దుబాయ్‌లో ఐదేళ్ల క్రితం జరిగిన ఫార్ములా-ఈ రేసింగ్‌లో రాజ్‌హిత్ ఇబ్రాన్‌తో నాకు పరిచయం ఏర్పడింది. తర్వాత స్నేహితులం అయ్యాం. ‘మన బంధాన్ని పెళ్లి వరకూ ఎందుకు తీసుకెళ్లకూడదు?’ అని ఇటీవల ఒకరికొకరు ప్రశ్నించుకుని, పెళ్లికి సిద్థమయ్యాం. మా ప్రేమ సంగతి నాకు బాగా కావాల్సిన వారికి మాత్రమే తెలుసు. చిత్ర పరిశ్రమలో ఎవరికీ తెలీదు. అందుకే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందులో మా మేనేజర్ కూడా ఒకరు’’ అని నివేదా తెలిపారు.