సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thammudu: పవన్ టైటిల్ కూడా కాపాడలేకపోయింది తమ్ముడు

ABN, Publish Date - Jul 04 , 2025 | 04:33 PM

టాలీవుడ్ లో కొన్నేళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్న కుర్ర హీరోల్లో నితిన్ (Nithiin) ఒకడు. 2020 లో భీష్మ సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్.. ఐదేళ్లుగా అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.

Thammudu

Thammudu: టాలీవుడ్ లో కొన్నేళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్న కుర్ర హీరోల్లో నితిన్ (Nithiin) ఒకడు. 2020 లో భీష్మ సినిమాతో మంచి హిట్ అందుకున్న నితిన్.. ఐదేళ్లుగా అలాంటి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్టార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్.. ఇలా సినిమాలు చేసుకుంటూనే వచ్చాడు కానీ, విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు తమ్ముడు (Thammudu)సినిమాపైనే నితిన్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. కానీ, ఈ సినిమాతో కూడా తమ్ముడు నితిన్ నిరాశపర్చాడు.


వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా తమ్ముడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్ గా నటించగా.. సీనియర్ హీరోయిన్ లయ తమ్ముడు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. మొదటి నుంచి అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్ చూసి అభిమానులు కూడా కొత్త కాన్సెప్ట్ అని అనుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజైన తమ్ముడు ఫ్యాన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. తమ్ముడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఎంత మంచి గుర్తింపును తెచ్చుకుందో అందరికీ తెల్సిందే.


పవన్ కెరీర్ లో టాప్ 10 హిట్ మూవీస్ లిస్ట్ తీసే అందులో తమ్ముడు కూడా ఉంటుంది. అలాంటి టైటిల్ ను నితిన్ తన సినిమా కోసం వాడుతున్నాడు అంటే కథ ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసారు. కేవలం టైటిల్ చూసే పవన్ ఫ్యాన్స్ చాలామంది నితిన్ సినిమాకు వెళ్లారు అని చెప్పొచ్చు. అక్కడ అన్నాతమ్ముళ్ల సెంటిమెంట్ అయితే.. ఇక్కడ అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్. కానీ ఆ తమ్ముడు లో ఉన్నంత ఎమోషన్స్... ఈ తమ్ముడులో లేవని పెదవి విరుస్తున్నారు.


చిన్న గొడవ వలన విడిపోయిన అక్కా తమ్ముళ్లు.. చివరకు ఎలా కలిశారు..? అక్కకి ఆపద వస్తే తమ్ముడు ఎలా కాపాడాడు..? అనేది కథ. లైన్ బావుంది కానీ.. వేణు శ్రీరామ్ చెప్పింది ఒకటి చేసింది మరొకటి అనిచెప్పుకొస్తున్నారు . అడవిలో అరుపులు తప్ప కథనాన్ని గట్టిగా పట్టుకొని చూపించింది లేదు. అసలు కథలో ఫైట్స్ ఉన్నాయా.. ? ఫైట్స్ లో కథ ఉందా.. ? అనేది తెలియకుండా పోయింది. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ అంత పండలేదు.


ఇక తమ్ముడు సినిమా వేరే సినిమాలను గుర్తుచేస్తుంది. అక్క కుటుంబాన్నిఊరు నుంచి దాటించే హీరో కథ.. కార్తీ నటించిన ఖైదీ సినిమాను గుర్తుచేస్తుంది. ఇక నిజాయతీ గల అధికారి అయిన అక్కను.. తమ్ముడు కాపాడే కథ నాని ఎంసీఏను గుర్తుచేస్తుంది. ఇలా సెకండాఫ్ మొత్తం ఈ రెండు సినిమాలను కలిపి కొట్టేసాడు డైరెక్టర్. నితిన్ నటన బాగున్నా ఇలాంటి కథలను ఎంచుకోవడం మానేస్తే బావుంటుంది అనేది అభిమానుల విన్నపం. తమ్ముడు టైటిల్ యాప్ట్ అయినా.. బలం లేని కథ కావడంతో ఆ టైటిల్ కూడా కాపాడలేకపోయింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా నితిన్ కి కానీ, లయకు కానీ, సప్తమి గౌడకు కూడా ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చేలా లేదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.


గత ఐదు ఏళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్న నితిన్ కు తమ్ముడు కూడా హ్యాండ్ ఇచ్చింది. ఇక దీని తరువాత నితిన్ నటిస్తున్న చిత్రం ఎల్లమ్మ. బలగం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కమెడియన్ వేణు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా నితిన్ ను గట్టెక్కిస్తుందో లేదో చూడాలి.

Fish Venkat: ఫిష్ వెంకట్ పరిస్థితి విషమం.. ప్రభాస్ సాయం

Updated Date - Jul 04 , 2025 | 04:38 PM