వినోదం పంచేందుకు
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:35 AM
సంగీత్ శోభన్, నయన సారిక జంటగా నిహారికా కొణిదెల నిర్మిస్తున్న కొత్త చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది...
సంగీత్ శోభన్, నయన సారిక జంటగా నిహారికా కొణిదెల నిర్మిస్తున్న కొత్త చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ ఇచ్చారు. మరో దర్శకుడు వశిష్ఠ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి ఇంకో దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే కుటుంబ కథా చిత్రం ఇది, ఈనెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం తెలిపింది.