సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Niharika Konidela: రెండో పెళ్లికి సిద్దమైన మెగా డాటర్

ABN, Publish Date - Aug 02 , 2025 | 06:07 PM

మెగా డాటర్ నిహారిక కొణిదెల( Niharika Konidela) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Niharika Konidela

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల( Niharika Konidela) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ గా నిహారికకు ఒక మంచి రికార్డ్ ఉంది. మెగా బ్రదర్ నాగబాబు వారసురాలిగా ఒక మనసు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నిహారిక.. మొదటి సినిమాతోనే పరాజయాన్ని అందుకుంది. నటన పరంగా కూడా మెగా డాటర్ కు అంత మంచి మార్కులు ఏమి రాలేదు. ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించినా మార్పులేకపోవడంతో ఆమెకు మెగా కుటుంబం పెళ్లి జరిపించింది.


చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. అయితే ఆ పెళ్లి మూడు నాళ్ల ముచ్చటగా మారింది. పెళ్ళైన రెండేళ్లకే వారిద్దరి మధ్య విభేదాలు.. చివరకు విడాకుల వరకు వచ్చాయి. మూడేళ్లకే వారు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల అనంతరం నిహారిక మరోసారి తన లక్ ను పరీక్షించుకోవడానికి ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారింది. రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తూ ప్రస్తుతానికి సాఫీగానే సాగుతుంది.


ఇక నిహారిక రెండో పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే నాగబాబు సైతం నిహారిక రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దంగానే ఉందని చెప్పుకొచ్చాడు..అంటే . ఇప్పటికే నిహారిక పెళ్లి ఫిక్స్ అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటిసారిలా పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదని, నిహారికనే ప్రేమించి, పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు. ఇక ఇంకోపక్క నిహారిక కన్ఫ్యూజన్ మైండ్ లో ఉందని, ఇప్పుడప్పుడే పెళ్లి వద్దు అంటుందని.. అందుకే మెగా ఫ్యామిలీ కూడా పెళ్లికి ఆలస్యం చేస్తుందని వార్తలు వస్తున్నాయి.


నిహారిక రెండో పెళ్లి విషయంలో ఏది నిజం.. ఏది అబద్దం అనేది ఇంకా తెలియరాలేదు. కానీ, నిహారిక ముఖంలో మాత్రం పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా నిహారిక.. పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చింది. రెడ్ కలర్ చీర కట్టుకొని.. చుట్టూ పూల బుట్టలు పెట్టి.. పెళ్లి కూతురుగా కనిపించింది. ఇది కేవలం ఫోటోషూట్ కోసమే అయినా నిహారిక మాత్రం అచ్చు పెళ్లి కూతురిలానే కనిపిస్తుందని, పెళ్లి కళ వచ్చేసిందే బాలా అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం నిహారిక ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Updated Date - Aug 02 , 2025 | 06:07 PM