Nidhhi Agerwal: శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. స్పందించిన నిధి అగర్వాల్
ABN, Publish Date - Dec 24 , 2025 | 06:17 PM
నటుడు శివాజీ (Sivaji).. హీరోయిన్ల బట్టలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. చాలామంది మహిళలు అతని వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
Nidhhi Agerwal: నటుడు శివాజీ (Sivaji).. హీరోయిన్ల బట్టలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. చాలామంది మహిళలు అతని వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అయితే తాను అన్న రెండు అసభ్యకరమైన పదాలు తప్పని ఒప్పుకొని సారీ చెప్తాను కానీ, నా స్టేట్మెంట్ తప్పు అని మాత్రం చెప్పను.. ఎవరికి భయపడను అని చెప్పుకొచ్చాడు.
తాను కేవలం మొన్న ది రాజాసాబ్ సాంగ్ లాంచ్ వెనెట్ లో నిధి అగర్వాల్ కి జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. త రాజాసాబ్ నుంచి సహానా సహానా సాంగ్ లాంచ్ ఈవెంట్ లుల్లూ మాల్ లో జరిగింది. ఆ ఈవెంట్ కు నిధి ఒక స్లీవ్ లెస్ లెహంగా ధరించింది. సాంగ్ లాంచ్ అయ్యాకా.. ఆమెపై ఫ్యాన్స్ ఒక్కసారిగా దాడి చేశారు. ఆమెను పట్టుకోవడానికి ట్రై చేశారు. చుట్టూ సెక్యూరిటీ ఎవరు లేకపోవడంతో.. ఫ్యాన్స్ ను తప్పించుకొని నిధి రావడం చాలా కష్టమైంది. ఎలాగోలా.. కొంతమంది ఆమెను కారులోకి తోశారు. ఇక అలా ఫ్యాన్స్ ఆమెపై ఎగబడడానికి ఆమె వేసుకున్న డ్రెస్ కారణమని శివాజీ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా సమంతకు కూడా ఇలానే జరిగింది. కానీ, నిధి అంతా కాదు ఎందుకంటే ఆమె చీరకట్టుకుందని శివాజీ వివరణ ఇచ్చాడు.
ఒకవేళ నిధి డ్రెస్ ఆరోజు జారితే.. ఎంత దారుణం జరిగేది. ఆమె వీడియోలు జీవితాంతం అలానే ఉంటాయి. ఇలాంటివి జరగకూడదు అనే నేను అలా మాట్లాడను అని చెప్పుకొచ్చాడు. ఇక నిధి గురించి చర్చ రావడంతో ఆమె స్పందించింది. ఆరోజు ది రాజాసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. బాధితురాలినే నిందించడాన్ని మోసం అంటారు అంటూ రాసుకొచ్చింది. అంటే ఆరోజు నేనే బాధితురాలిని.. కానీ, ఆ డ్రెస్ వేసుకున్నందుకే అలా జరిగిందని నన్నే అంటున్నారు. దీన్ని మానిప్యులేట్ అని అంటారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.