సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nidhhi Agerwal: ఆయనతో నటించడం నా అదృష్టం

ABN, Publish Date - Jul 18 , 2025 | 04:04 AM

‘పవన్‌ కల్యాణ్‌తో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే...పవన్‌ కల్యాణ్‌తో ఒక్క సినిమా చేసినా...

‘పవన్‌ కల్యాణ్‌తో కలసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న పవన్‌ సినిమా ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే...పవన్‌ కల్యాణ్‌తో ఒక్క సినిమా చేసినా ఒకటే. ఈ ప్రయాణంలో ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా’ అని అన్నారు హీరోయిన్‌ నిధి అగర్వాల్‌. ఆమె కథానాయికగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో చిత్ర విశేషాలు పంచుకొన్నారు.

  • ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘పంచమి’. చాలా శక్తిమంతమైన పాత్ర అది. పాత్రకు తగ్గట్టుగా స్టైలిస్ట్‌ ఐశ్వర్య దుస్తులను, ఆభరణాలను అద్భుతంగా రూపొందించారు. పవన్‌ కల్యాణ్‌కి, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి.

  • డైరెక్టర్‌ క్రిష్‌ నన్ను ‘పంచమి’ పాత్రకు ఎంపిక చేశారు. అలాగే జ్యోతి కృష్ణ సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు.

  • ఏ.ఎం.రత్నం గొప్ప నిర్మాత. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్ళు బలంగా నిలబడ్డారు. చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

  • ట్రైలర్‌ రాకముందు కొందరు ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ట్రైలర్‌ పటాపంచలు చేసింది. ఈ సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఛాలెంజింగ్‌గా అనిపించింది.

  • పీరియాడికల్‌ సినిమాలకు కీరవాణి పెట్టింది పేరు. పైగా ఆస్కార్‌ విజేత. వీరమల్లుకి అద్భుతమైన సంగీతం అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ‘తార తార’, ‘కొల్లగొట్టినాదిలో’ పాటలు నాకు బాగా నచ్చాయి.

ఇవి కూడా చదవండి:

నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్

40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా

Read Latest and Health News

Updated Date - Jul 18 , 2025 | 04:04 AM