Nidhhi Agerwal: నాకేం సంబంధం లేదంటూ నిధీ అగర్వాల్ క్లారిటీ
ABN, Publish Date - Aug 11 , 2025 | 07:50 PM
తాజాగా నిధీ అగర్వాల్ భీమవరంలో జరిగిన ఓ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ బోర్డు ఉన్న వాహనంలో ఆమె కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాజాగా నిధీ అగర్వాల్ (Nidhhi Agerwal) భీమవరంలో జరిగిన ఓ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ బోర్డు (Nidhhi Agerwal govt Vehicle) ఉన్న వాహనంలో ఆమె కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రభుత్వం విధులు నిర్వహించే అధికారులు, నాయకులు ప్రయాణించాల్సిన వాహనాలు అది. ఆ వీడియో బయటకు రావడంతో చర్చనీయాంశమైంది. ఓ హీరోయిన్ ప్రభుత్వ వాహనంలో ఎందుకు ప్రయాణించిందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. దీనికి నిధీ క్లారిటీ ఇచ్చారు. అది నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనమని ఆమె తెలిపారు. ఎక్స్ వేదిక వివరణ ఇస్తూ ఓ లేఖ పోస్ట్ చేశారు.
‘ఇటీవల భీమవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా జరిగిన పరిణామాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం ఏర్పాటు చేసిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్ఘ్రభుత్వానిది. ఆ విషయంలో నా పాత్ర లేదు. ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. అవన్నీ నిరాధారమైనవి. ఈ విషయంలో నాకెలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నాకు ఎలాంటి వాహనం ప్రత్యేకంగా పంపలేదు. నా ప్రియమైన అభిమానులకు వాస్తవాలను చెప్పడం నా బాధ్యత. ప్రతి విషయంలోనూ ప్రేమ, సహకారం అందిస్తున్న ఫ్యాన్స్‌కు థ్యాంక్స్’ అని పేర్కొన్నారు. ఇటీవల పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘హరి హర వీరమల్లు’లో కథానాయికగా నటించింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’లోనూ నిధి నటిస్తున్నారు.