సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nidhhi Agerwal: హరిహర వీరమల్లు పార్ట్‌-2 అప్డేట్

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:08 PM

పవన్‌తో కలిసి నిధీ అగర్వాల్‌ నటించిన ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌తో నటించిన ‘రాజాసాబ్‌’ డిసెంబర్‌ 5న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు



‘గత ఎన్నికలకు ముందు పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ సినిమా మొదలపెట్టారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఈ సినిమానే మొదట పూర్తి చేశారు. ఐదేళ్ల కాలంలో పవన్‌ కల్యాణ్‌లో ఎలాంటి మార్పు రాలేదు’ అంటూ పవన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు నిధీ అగర్వాల్‌. ప్రస్తుతం ఆమె రెండు భారీ చిత్రాలతో అలరించడానికి సిద్ధంగా ఉంది. పవన్‌తో కలిసిన నటించిన ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. . ప్రభాస్‌తో నటించిన ‘రాజాసాబ్‌’ డిసెంబర్‌ 5న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం పవన్‌ కల్యాణ్‌ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వర్క్‌షాపులు చేశారు. సినిమాలో ప్రతి విభాగంలోనూ భాగమయ్యారు. డైలాగ్స్‌, పాటలు, పోరాట సన్నివేశాలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. విజయవాడలో షూటింగ్‌ చేసినన్ని రోజులు విరామ సమయంలో ఒకవైపు మీటింగ్‌లో పాల్గొంటూనే చిత్రీకరణకు వచ్చేవారు. విజువల్‌ వండర్‌లా సినిమాను తీర్చిదిద్దారు. నిర్మాత ఏ ఎం రత్నం ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఆయనతోపాటు మా టీమంతా ఎంతో నమ్మకంగా ఉన్నాం. నేను ట్రైలర్‌ ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు.  సినిమా మొదలైనప్పుడు చాలా రూమర్లు వచ్చాయి. ట్రైలర్‌ విడుదలయ్యాక అన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పడింది. ‘హరిహర వీరమల్లు’ పార్ట్‌-2 కూడా 20 నిమిషాల షూటింగ్‌ పూర్తి చేశాం. మొదటి పార్ట్‌ విడుదలైన తర్వాత తిరిగి షూటింగ్‌కు వెళ్తాం‘ అన్నారు.


ఇంకా అమె చెబుతూ ‘మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు చాలా విమర్శలు వస్తుంటాయి. వాటిని లెక్క చేయకుండా మన పని మనం చేసుకోవాలి. మొదట బాలేదు అన్న ప్రేక్షకులే వెంటనే చాలా బాగుంది అని అంటారు. బాగా చేశారని ప్రశంసిస్తుంటారు. అందుకే రూమర్స్‌ను పట్టించుకోకుండా మన పని శ్రద్థగా చేసుకుంటూ వెళ్లిపోవాలి. నేను అయితే రూమర్స్‌ పట్టించుకోను. నాకు తెలుగు ప్రేక్షకులంటే చాలా ఇష్టం. తెలుగులో నాకు అవకాశాలు రావడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.  

Updated Date - Jul 15 , 2025 | 02:37 PM