New Guy In Town: కొంచెం.. ఆ హీరో ఎవరో చెప్పండయ్యా..
ABN, Publish Date - Dec 07 , 2025 | 07:44 PM
ఇండస్ట్రీకి రోజుకో కొత్త హీరో పరిచయమవుతున్నాడు. కొందరు హిట్ అయ్యాక గుర్తింపు తెచ్చుకుంటే.. ఇంకొందరు నేపో కిడ్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
New Guy In Town: ఇండస్ట్రీకి రోజుకో కొత్త హీరో పరిచయమవుతున్నాడు. కొందరు హిట్ అయ్యాక గుర్తింపు తెచ్చుకుంటే.. ఇంకొందరు నేపో కిడ్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక తాజాగా కొత్త కుర్రాడు టౌన్ లో దిగాడు. ఎవరా కొత్త కుర్రాడు అనేది మాత్రం తెలియదు. అదేంటి.. ఈ కన్ఫ్యూజన్ ఏంటి.. అంటే, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman)ఈ కన్ఫ్యూజన్ ను మొదలుపెట్టాడు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఒక కొత్త సినిమా అనౌన్స్ మెంట్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
న్యూ గాయ్ ఇన్ టౌన్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక గ గ్లింప్స్ ను థమన్ రిలీజ్ చేశాడు. ఇందులో హీరో కొత్తవాడు.. హీరోయిన్ కొత్త అమ్మాయి.. డైరెక్టర్.. చివరికి ప్రొడక్షన్ కూడా కొత్తదే. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ రేంజ్ లో కుర్రాడు ఎంట్రీ ఇస్తున్నాడు అంటే కచ్చితంగా నేపో కిడ్ అనే మాటలు వినిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు హీరోగా లాంచ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అతని సినిమానే ఇది అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఒక్క గ్లింప్స్ తోనే మేకర్స్ అటెన్షన్ మొత్తం గ్రాబ్ చేశారు. ముఖానికి మాస్క్ వేసుకొని స్పైడర్ మ్యాన్ లా దూకుతున్న ఈ కుర్రాడు ఎవరు.. ? ఒకవేళ టైటిలే అదా.. ? ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు.. ? థమన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇస్తున్నాడు అంటే పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉండే ఉండాలి అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఆ హీరోను డిసెంబర్ 14 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఆ హీరో ఎవరో కొంచెం చెప్పండయ్యా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆ హీరో ఎవరో తెలియాలంటే ఇంకో వారం ఆగాల్సిందే.