Srikanth Iyengar: గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు.. శ్రీకాంత్ అయ్యంగార్‌పై నెటిజన్లు సీరియస్
ABN, Publish Date - Oct 08 , 2025 | 07:16 AM
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పటికే పలుసార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పటికే పలుసార్లు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మహాత్మా గాంధీ (Mahathma Gandhi)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర స్థాయిలో దూషించారు. గాంధీజీ స్త్రీ లోలుడని, ఎంతో మంది ఆడవారిని లైంగికంగా వేధించాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
స్వాతంత్య్రం గాంధీ వల్ల కాదు సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ వల్లే వచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో నెట్టింట పెద్ద దుమారమే రేగింది. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మహాత్మాగాంధీ పుట్టినరోజున కూడా శ్రీకాంత్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, సినీ తారలు ఇలా హద్దులు మీరి మాట్లాడడం, తరువాత నాలిక్కరుచుకోవడం ఓ అలవాటు అయిపోయిందని, మొన్న రాహుల్ రామకృష్ణ, నేడు శ్రీకాంత్.. ఇలా మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తే బాగుంటుందనేదని అంటున్నారు.
మరోవైపు అనక మంది నెటిజన్లు శ్రీకాంత్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. ఫస్ట్ వాట్సప్ యూనివర్సిటీకి దూరంగా ఉండు.. వాట్సప్ డిలీట్ చేయ్ అన్ని కరెక్ట్‌గా కనిపిస్తాయంటూ హితవు పలుకుతున్నారు.