Rahul Ravindran: అమ్మాయి చున్నీ తీయడం.. విమెన్ ఎంపవర్ మెంటా
ABN, Publish Date - Nov 12 , 2025 | 04:48 PM
రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend) సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Rahul Ravindran: రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend) సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. టాక్సిక్ రిలేషన్ లో ఉన్న అమ్మాయి దాని నుంచి ఎలా బయటపడింది.. అసలు అమ్మాయిలకు కావాల్సింది ఏంటి.. అనే విషయాలను ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమా చూసిన మహిళా ప్రేక్షకులు థియేటర్ లో ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఒక అమ్మాయి ఈ సినిమా చూసి థియేటర్ లో రాహుల్ ను మీట్ అయ్యి ఎమోషనల్ అయ్యింది. ఈ సినిమా క్లైమాక్స్ చూసాక నాకు ఒకటి తీయాలనిపించిందని చెప్తూ తన ఒంటిపై ఉన్న చున్నీని తీసేసింది. దీంతో వెంటనే రాహుల్ ఐ లైక్ దట్ అని ఆమెను ఆమె అనుమతి లేకుండా కౌగిలించుకున్నాడు.
ఇక ఈ వీడియోను గీతా ఆర్ట్స్ అధికారికంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రాహుల్ పై ఫైర్ అవుతున్నారు. అమ్మాయి చున్నీ తీసేస్తే అదే ఇష్టం అంటాడేంటి.. అసలు చున్నీ తీయడం అంటే విమెన్ ఎంపవర్ మెంట్ ఎలా అవుతుంది. అది ఆడవారికి ఒక రక్షణ కవచం. అలాంటి చున్నీ తీసేస్తే డైరెక్టర్ ప్రశంసించడం ఏంటి.. ఇలా చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. అంటే చున్నీలు వేసుకోకుండా ఉంటేనే విమెన్ ఎంపవర్ మెంటా లేకపోతే కాదా.. ? సినిమాలో రష్మిక దుపట్టాతోనే కనిపించింది. బయట థియేటర్ కు వచ్చినప్పుడు చున్నీలతోనే వచ్చింది.
సినిమాలో ఉన్నట్లు బయట ఎవరు ఉండలేరు. అదొక సినిమా.. నేను చూపించింది కూడా అమ్మాయిలు ఏ నిర్ణయం తీసుకున్నా స్వతంత్రంగా తీసుకోవాలని చెప్పాను కానీ, ఆచారాలను, సాంప్రదాయాలను పక్కన పెట్టమని చెప్పలేదు అని చెప్పకుండా హాగ్ చేసుకొని మరీ కంగ్రాట్స్ చెప్పడం.. ఆ వీడియోను షేర్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని మండిపడుతున్నారు. మరి ఈ వీడియోపై రాహుల్ వివరణ ఇస్తాడేమో చూడాలి.