Trivikram: ఓర్నీ.. గురూజీ గురూజీ అంటుంటే.. గుండెల్లో పొడిచావ్ గా బాసూ
ABN, Publish Date - Dec 02 , 2025 | 03:04 PM
సోషల్ మీడియా రాకముందు ఎవరు ఏం చేస్తున్నారు.. ? ఎలాంటి సినిమాలు తీస్తున్నారు.. ? ఎక్కడ కాపీ కొడుతున్నారు.. ? అనేది ఎవరికి తెలియదు. సినిమా రిలీజ్ అయ్యాకా.. అబ్బా ఎంత గొప్పగా తీశాడు. అతడి క్రియేటివిటీకి దండం పెట్టొచ్చు అంటూ పొగిడేవారు.
Trivikram: సోషల్ మీడియా రాకముందు ఎవరు ఏం చేస్తున్నారు.. ? ఎలాంటి సినిమాలు తీస్తున్నారు.. ? ఎక్కడ కాపీ కొడుతున్నారు.. ? అనేది ఎవరికి తెలియదు. సినిమా రిలీజ్ అయ్యాకా.. అబ్బా ఎంత గొప్పగా తీశాడు. అతడి క్రియేటివిటీకి దండం పెట్టొచ్చు అంటూ పొగిడేవారు. కానీ, ఇప్పటి పరిస్థితి అలా లేదు. ఒక సినిమా రిలీజ్ అయ్యింది అంటే.. కథ మాత్రమే కాదు.. పోస్టర్, సీన్, మ్యూజిక్, సాంగ్ , కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతిదీ ఒరిజినలా.. లేక కాపీనా అని చెప్పేస్తున్నారు. కథలను పోలిన కథలు ఉంటాయి అని అనుకున్నా.. ఏ డైరెక్టర్ కూడా ఒకే సీన్ ను ఒకేలా షూట్ చేయలేడు. కేవలం కాపీ కొట్టినప్పుడు మాత్రమే అలా చేయగలడు.
ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. తన సినిమాల్లో ఎన్నో సీన్స్ ను హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టాడని నెటిజన్స్ ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు. అదేంటి ఈ మధ్యకాలంలో గురూజీ ఏ సినిమా తీయలేదు కదా అంటే.. పాత సినిమాలను తిరగతోడుతున్నారు. గురూజీ దర్శకత్వంలో మహేష్ బాబు, త్రిష జంటగా అతడు సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా థియేటర్ లో ఎన్నిరోజులు ఆడిందో తెలియదు కానీ, మాటీవీ లో మాత్రం ఏడాది పొడువునా ప్రసారం అవుతూనే ఉంటుంది.
ఇక అతడు సినిమాలో ఐకానిక్ సీన్ అంటే మహేష్ బాబు తాడు పట్టుకొని రైలు మీదకు దూకేదే. మంత్రి శివారెడ్డిని చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్ అయిన నందగోపాల్.. ఒక బిల్డింగ్ లో ఎదురుచూడడం.. అనుకోకుండా నందు గన్ నుంచి కాకుండా వేరొక గన్ నుంచి వచ్చిన బులెట్ తగిలి శివారెడ్డి మరణించడం, వెంటనే పోలీసులు ఎవరో చెప్పినట్లుగా నందు ఉన్న బిల్డింగ్ వైపే రావడం.. పోలీసుల నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న బిల్డింగ్ ఎక్కుతాడు. ఆ బిల్డింగ్ ని పోలీసులు సరౌండ్ చేసి.. అతనికి గన్ గురిపెట్టడంతో ఎటు పారిపోవాలో తెలియని నందు తాడు సహాయంతో పక్కనే రైల్వే స్టేషన్ లో వెళ్తున్న ట్రైన్ పైకి దూకేస్తాడు.. ఈ సీన్ సినిమాకే హైలైట్. అప్పట్లో ఈ సీన్ గురించి, గురూజీ క్రియేటివిటీ గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు.
అయితే ఇదంతా గురూజీ క్రియేటివిటీ కాదు.. హాలీవుడ్ సినిమా కాపీ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. 1998లో వచ్చిన హాలీవుడ్ లో వచ్చిన యూఎస్ మార్షల్స్ సినిమాలోని సీనే కాపీ కొట్టి గురూజీ అతడులో పెట్టాడు. ఆ 2005 లో అతడు రావడంతో దాదాపు ఏడేళ్ల క్రితం సినిమాగా ఎవరు గుర్తుపడతారులే అని త్రివిక్రమ్ అనుకోని ఉంటాడు. కానీ, ఇప్పటి యువత సగానికి సగం మంది ఇదే పని మీద ఉంది. ఇక ఇదొక్కటేనా అజ్ఞాతవాసి, అల వైకుంఠపురంలో, జులాయి.. ఇలాంటి చాలా సినిమాల్లో హాలీవుడ్ రిఫరెన్స్ లు ఉంటాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు గురూజీ గురూజీ అని నీ క్రియేటివిటీని పొగుడుతుంటే.. కాపీ చేసి గుండెల్లో పొడిచావ్ కదా బాసూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.