Mana Shankara Varaprasad Garu: శశిరేఖ.. సర్‌ఫ్రైజ్‌తో వస్తోంది
ABN, Publish Date - Oct 01 , 2025 | 12:40 PM
అనీల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తోన్న చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనీల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తోన్న చిత్రం మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు (Mana Shankara Varaprasad Garu). నయనతార (Nayanthara) కథానాయిక. చిరంజీవి 157 వ చిత్రంగా ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లకు తీసుకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, గ్లిమ్స్ వీడియోలు అంతకుమించి అనే రేంజులో స్పందనను దక్కించుకున్నాయి. అయితే విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఈ సినిమా నుంచి శశిరేఖ (SASIREKHA)గా చేస్తున్న నయనతార పేరును రివీల్ చేసి గురువారం సర్‌ఫ్రైజ్ ఉందంటూ మేకర్స్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.