సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Naveen Polishetty: నిగనిగనిగా.. దగదగ.. గాయకుడిగా నవీన్ పోలిశెట్టి! ఘెరమైన ప్రాక్టీస్‌

ABN, Publish Date - Nov 25 , 2025 | 03:37 PM

హీరోలు సింగర్స్‌గా మారి పాటలు పాడటం కొత్తేమీ కాదు. పాతతరంలో గొంతు సవరించినవారు చాలామందు ఉన్నారు. కథా రచయితగా, హీరోగా గుర్తింపు పొందిన నవీన్‌ పోలిశెట్టి ఇప్పుడు గాయకుడిగా అవతారమెత్తనున్నారు.

హీరోలు సింగర్స్‌గా మారి పాటలు పాడటం కొత్తేమీ కాదు. పాతతరంలో గొంతు సవరించినవారు చాలామంది ఉన్నారు. కథా రచయితగా, హీరోగా గుర్తింపు పొందిన నవీన్‌ పోలిశెట్టి ఇప్పుడు గాయకుడిగా అవతారమెత్తనున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’, మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్‌ కంటెంట్‌ సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చింది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ పోలిశెట్టి ఓ పాట పాడనున్నారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలిపారు మేకర్స్‌. ‘నిగనిగనిగా.. దగదగ’ అంటూ సమీరా భరాద్వాజ్‌తో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆయన పాడుతున్న మొదటి పాత ఇది.  ఈ నెల 27న  ఈ పాటను భీమవరం ఎస్ఆర్ కే ఆర్ కాలేజ్ లో  ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి విడుదల చేయనున్నారు.  

అంతే కాదు సినిమా విడుదలపైనా క్లారిటీ ఇచ్చారు. తొలుత చిత్రాన్ని సంక్రాంతి బరిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే టైమ్‌ భారీ చిత్రాలు ‘రాజాసాబ్‌’, ‘మన శంకరవరప్రసాద్‌గారు’, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు విడుదల ఉండటంతో ఈ చిత్రం వెనక్కి తగ్గుతుందనే వార్తలు హల్‌చల్‌ చేశాయి. అయితే అవన్నీ వాస్తవాలని నిర్మాణ సంస్థయుయ కొట్టి పారేసి జనవరి 14న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Updated Date - Nov 25 , 2025 | 05:34 PM