Naveen Chandra: మాస్ జాతర.. పవర్ ఫుల్‌గా నవీన్‌చంద్ర రోల్
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:06 PM
'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో బాలిరెడ్డిగా నెగటివ్ పాత్రలో మెప్పించాడు నవీన్ చంద్ర (Naveen Chandra). ఇప్పుడు అదే తరహాలో మరో పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో బాలిరెడ్డిగా నెగటివ్ పాత్రలో మెప్పించాడు నవీన్ చంద్ర (Naveen Chandra). ఇప్పుడు అదే తరహాలో మరో పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రవితేజ (Raviteja), శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం 'మాస్ జాతర'(Mass Jathara). భాను భోగవరపు దర్శకత్వం చేయగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నవీన్ చంద్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన మాస్ జాతర ట్రైలర్ లో నవీన్ చంద్ర వాయిస్ ఓవర్ తో మొదలై 'కేజీ రెండు కేజీలు కాదురా! 20 టన్నులు. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్ లో ఎక్కించండి' అంటూ నవీన్ చంద్ర గంభీరమైన గొంతుతో అలరించాడు. దీనిని బట్టి చూస్తే ఈ చిత్రంలో ఆయనకు ప్రధాన పాత్రే దక్కిందని తెలుస్తోంది.

ట్రైలర్ లో ఆయన కనిపించిన ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పేయించేలా ఉన్నాయి. నవీన్ చంద్ర లుక్, జుట్టు గడ్డంతో ఎంతో రగ్గడ్ గా కనిపిస్తూ ట్రైలర్ లోని మరొక డైలాగ్ తో తన క్యారెక్టర్ ఎంత ఇంటెన్సిఫైడ్ గా పవర్ ఫుల్ గా ఉంటుందో కేవలం ఆ ఒక్క డైలాగుతూనే అర్థమవుతుంది. 'లక్ష్మణుడు అంటే రాముడి బ్రదర్. అర్థాయిషుతో పోతే ఆంజనేయుడు బ్రతికించిన క్యారెక్టర్! ఇక్కడ సంజీవని లేదు, ఆంజనేయుడు రాడు. ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలివ్వడం నా ఆనవాయితీ, ఈ సుట్టు నాను నిన్ను బలిస్తున్నాను రా" అంటూ ట్రైలర్ కు ముగింపు ఇచ్చారు. ట్రైలర్ లో నవీన్ చంద్రను చూస్తే ఈ చిత్రంలోని అతని క్యారెక్టర్ తన సినీ కెరియర్ లో మరొక మార్క్ గా నిలిచిపోతుందని అర్థమవుతుంది. ఈ చిత్రం అక్టోబర్ 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.