Navadeep: శివాజీ దరిద్రపు ముండా కామెంట్స్.. ఆపడానికి నేనెవరిని
ABN, Publish Date - Dec 31 , 2025 | 01:28 PM
నటుడు శివాజీ (Shivaji) దండోరా (Dhandoraa) సినిమా ప్రెస్ మీట్ లో ఆడవారి డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.
Navadeep: నటుడు శివాజీ (Shivaji) దండోరా (Dhandoraa) సినిమా ప్రెస్ మీట్ లో ఆడవారి డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. చిన్న చిన్న బట్టలు వేసుకొని సామాన్లు కనిపించేలా తిరిగితే అందరూ దరిద్రపు ముండా ఏంటి ఇలా వేసుకుంది అని తిడతారు అని, పద్దతిగా చీరలు కట్టుకోండి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు కొంతమందికి నచ్చినా.. ఇంకొంతమందికి మాత్రం నచ్చలేదు. ముఖ్యంగా చిన్మయి, అనసూయ.. మహిళలను రెచ్చగొట్టేలా మాట్లాడడంతో.. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు శివాజీపై మండిపడ్డారు.
ఇక ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కూడా శివాజీపై మండిపడ్డారు. అందులో హీరో నవదీప్ కూడా ఉన్నాడు. శివాజీ ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వెనుకే నిలబడ్డాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఒక కాలేజ్ స్టూడెంట్.. శివాజీ అలా మాట్లాడుతుంటే మీరెందుకు ఆపలేదు. శివాజీని మీరు కంట్రోల్ చేస్తారేమో అని అనుకున్నాం అని అడిగాడు. దానికి నవదీప్ మాట్లాడుతూ.. ' ఆయనకు అనిపించింది ఆయన మాట్లాడుతున్నప్పుడు.. తప్పా.. రైటా అనేది వాళ్లకు తెలియాలి. వినేవారికి తెలియాలి. ఎవరి పర్స్పెక్టీవ్ వాళ్లకి ఉంటుంది. నీ మాటను నువ్వు మాట్లాడుతుంటే అది తప్పు అని చెప్పడానికి నేనెవరిని.
ఒక షాకింగ్ విషయం విన్నప్పుడు.. మీరెలా ఫీల్ అయ్యారో.. నేను అలానే ఫీల్ అయ్యాను. పక్కనవాడు మాట్లాడేది మనం ఖండించాలి అని అనుకుంటే.. కానీ అప్పటికప్పుడు ఖండించాలా.. ? ఆ తరువాత మన అభిప్రాయం చెప్పాలా.. ? లేదా అక్కడి నుంచి వెళ్లిపోవాలా.. ? అనేది మన మైండ్ లో వచ్చిన రియాక్షన్ ప్రకారం చేస్తాం. నేను అక్కడి నుంచి వచ్చేసాను అది నా రియాక్షన్. పబ్లిక్ లో మాట అనేది కేవలం యాక్టర్స్ వరకేనా అంటే.. ట్రెండ్ ని బట్టి ఒక కీబోర్ట్ పట్టుకొని ఇష్టమొచ్చినట్లు అనేస్తున్నారు ఇవన్నీ మేము పడుతున్నాం.
కేవలం మేము అనే కాదు పబ్లిక్ లో కనిపించడం లేదు కదా అని కానీ, కనిపిస్తున్నాం కదా అని ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. ఆయన ఆ మాటలు అంటుంటే.. కెమెరా వెనుక చాలామంది చప్పట్లు కొడుతున్నారు. వైరల్ మీమ్స్ తో మాట్లాడేటప్పుడు అది జోక్ గా తీసుకుంటున్నారు. సామాన్లు బావుండాలి అనే మీమ్ వాడు ఏ ఉద్దేశ్యంతో అన్నాడో తెలుసు. ఒక మగాడిగా ఆ మాట అమ్మాయి ముందు అంటే అది బూతు. ఆ కాంటెక్ట్స్ తప్పు. ఇప్పుడు బయట అమ్మాయిలు కూడా సామాన్లు బావున్నాయా అని మాట్లాడుకుంటున్నారు. ఈ వైరాలిటీలో ఏ పదానికి ఏ అర్ధం ఉంది అనేది.. ఎలాంటి సందర్భంలో అంటున్నాం అనేది తెలుసుకోకుండా అనేస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.