Nani: 'ప్యారడైజ్' లుక్ లో పోరడు.. మస్తుండులే
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:08 PM
న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా పరాజయాన్నే అందుకొని హీరోగా నాని టైర్ 2 హీరోల నుంచి టైర్ 1 హీరోగా మారిపోయాడు.
Nani: న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా పరాజయాన్నే అందుకొని హీరోగా నాని టైర్ 2 హీరోల నుంచి టైర్ 1 హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ (The Paradise) ఒకటి. శ్రీకాంత్ ఓదెల - నాని కాంబోలో ఇప్పటికే దసరా లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ ది ప్యారడైజ్ తో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్యారడైజ్ పట్టాలెక్కిన విషయం తెల్సిందే.
ఇక ది ప్యారడైజ్ నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసి పడేసింది. కాకుల కథ అంటూ ఒక మహిళ తన కొడుకు గురించి పచ్చిగా చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. దసరా సినిమాలో విశ్వరూపం చూపించిన నాని.. ప్యారడైజ్ తో నట విశ్వరూపం చూపించడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం నాని చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా న్యాచురల్ స్టార్ నాని చాలా గ్యాప్ తరువాత మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. అసలు నాని న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దసరా కు మించి గంభీరంగా కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం, జుట్టు పెంచి రగ్గడ్ లుక్ లో దర్శనమిచ్చాడు. అందుతున్న సమాచారం ప్రకారం...ప్యారడైజ్ లో నాని రెండు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట. దానికోసమే గుబురు గడ్డం పెంచుతున్నాడు. క్లీన్ షేవ్ తో ఇప్పటికే ఒక లుక్ బయటకు వచ్చింది. త్వరలోనే రెండో లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారని టాక్. ఈ రెండు లుక్స్ తో ప్యారడైజ్ పై అంచనాలు ఆకాశానికి తాకాయి. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Ranbir kapoor: ‘రామాయణ’ కోసం ఆ బయోపిక్ వదులుకున్నారు.. మంచి నిర్ణయమే
Mayasabha Trailer: మయసభ.. కొత్త వివాదాలకు తెరతీసేనా..