Ranbir kapoor: ‘రామాయణ’ కోసం ఆ బయోపిక్ వదులుకున్నారు.. మంచి నిర్ణయమే
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:02 PM
బాలీవుడ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) సినిమా కోసం కిశోర్ కుమార్ బయోపిక్‌ను రణ్‌బీర్ వదులుకున్నారని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు (anurag basu) అన్నారు.
బాలీవుడ్‌లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (Ramayana) సినిమా కోసం కిశోర్ కుమార్ బయోపిక్‌ను రణ్‌బీర్ వదులుకున్నారని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు (anurag basu) అన్నారు. ఆయన తీసుకున్నది వంద శాతం మంచి నిర్ణయమని ఆయన ప్రశంసించారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనురాగ్ బసు దివంగత గాయకుడు, నటుడు కిశోర్ కుమార్ (Kishore kumar biopic) బయోపిక్ గురించి మాట్లాడారు.
‘‘నేను రణ్‌బీర్‌తో మరో సినిమా చేయాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా. కానీ, మా ప్రయత్నాలు ఫలించడం లేదు. రణ్‌బీర్ తన జీవితంలో ఏ విషయంలోనైనా నిజాయతీగా నిర్ణయాలు తీసుకుంటాడు. రామాయణ ఆఫర్ వచ్చినప్పుడే కిశోర్ కుమార్ బయోపిక్‌లోనూ అవకాశం వచ్చింది. ఇలాంటి రెండు అవకాశాలు వచ్చినప్పుడు ఒకటి ఎంపిక చేసుకోవడం చాలా కష్టం. రెండు అద్భుతమైన చిత్రాలే. రణ్‌బీర్ రామాయణను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా కోసం ఆ బయోపిక్‌ను వదులుకున్నారు’’ అని చెప్పారు. అనురాగ్ బసు కాంబినేషన్‌లో రణ్‌బీర్ హీరోగా ‘బర్ఫీ’, ‘జగ్గా జాసూస్’ రెండు సినిమాలు తీశారు. అయితే కిశోర్‌కుమార్ బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటించనున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపై కూడా అనురాగ్ బసు స్పందించారు. దానిపై ఇంకా క్లారిటీ లేదు. అప్పుడు ఏం చెప్పలేం. అంతా ఫైనల్ అయ్యా అగ్రిమెంట్ జరిగాక అధికారికంగా ప్రకటన వస్తుంది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నితేశ్ తివారీ దర్శకత్వంలో రెండు పార్టులుగా ‘రామాయణ’ తెరకెక్కుతోంది. దాదాపు ఈ చిత్రం 4 వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని, 2027లో రెండో పార్ట్ ను విడుదల చేయనున్నారు.