Natti kumar: ఫైనల్‌గా షూటింగులు మొదలయ్యాయి.. నట్టికుమార్‌ ఏమన్నారంటే..

ABN , Publish Date - Aug 22 , 2025 | 06:27 PM

సినిమా ఇండస్ట్రీలో18 రోజులుగా జరిగిన బంద్‌కు (tollywood Bund) గురువారంతో ముగింపు పలికారు. ప్రభుత్వ జోక్యంతో ఫెడరేషన్‌, నిర్మాత మధ్య చర్చలు ఫలించాయి.

సినిమా ఇండస్ట్రీలో18 రోజులుగా జరిగిన బంద్‌కు (tollywood Bund) గురువారంతో ముగింపు పలికారు. ప్రభుత్వ జోక్యంతో ఫెడరేషన్‌, నిర్మాత మధ్య చర్చలు ఫలించాయి. దాంతో శుక్రవారం నుంచి షూటింగ్‌లు షురూ అయ్యాయి. ఈ మేరకు నిర్మాత నట్టి కుమార్‌ (Natti kumar) ‘ఏబీన్‌'తో మాట్లాడారు.

'కొందరు నిర్మాతల వల్లే సినీ పరిశ్రమలో అగాధం నెలకొంది. చిరంజీవి(Chiranjeevi) గారి వద్దకు సెటిల్‌ చేయమని నిర్మాతలు వెళ్లారు. దిల్‌ రాజు, సుప్రియ, కిరణ్‌ చిరంజీవిగారితో మాట్లాడారు. అనంతరం చిన్న నిర్మాతలు, ఫెడరేషన్‌ సభ్యులు చిరంజీవిని కలుస్తామన్నారు. ఆయన మమ్మల్ని పిలిపించి అందరి సమస్యలు విన్నారు. చివరికి అందరం కలిసి చిరంజీవి టైమ్‌ను మేము వేస్ట్‌ చేశాం. నిజానికి చిరంజీవి వల్లే సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఈలోపు ప్రభుత్వానికి కొందరు నిర్మాతలు తప్పుడు సమాచారం అందించారు. ఫైనల్‌గా సమ్మె విషయంలో ప్రభుత్వం విజయం సాధించింది. రేవంత్‌ రెడ్డి దయ వల్లే ఈరోజు షూటింగ్‌లు మొదలయ్యాయి. అయితే లేబర్‌ కమీషనర్‌ ఆఫీస్‌ వద్ద కనీసం చిరంజీవి గారి సపోర్ట్‌ను ఎవరు గుర్తుచేసుకోలేదు. చివరికి నిర్మాతలు, కార్మికులు ఎవరికి ఎంత లబ్ది చేకూరుతుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది’ అన్నారు.

ALSO READ: Anil Ravipudi: రఫ్పాడిస్తాను.. బాక్స్‌ బద్దలైపోద్ది డైలాగులుంటాయి.. కానీ..

Bunny: ఐకాన్ స్టార్ తో చేతులు కలుపుతున్న విజయ్ సేతుపతి

Anil Ravipudi: సంక్రాంతిలోపు ఒక్కొక్క సర్‌ప్రైజ్‌ చూస్తారు..



Updated Date - Aug 22 , 2025 | 06:32 PM