సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: నేషనల్ అవార్డ్స్ లో దంచికొట్టిన టాలీవుడ్.. ఎన్ని అవార్డులు వచ్చాయంటే

ABN, Publish Date - Aug 01 , 2025 | 08:36 PM

టాలీవుడ్.. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే ఉంది. దూసుకుపోతున్నప్రపంచంకు ధీటుగా టాలీవుడ్ కూడా ఎంతో విభిన్నంగా ఆలోచిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది.

Tollywood

Tollywood: టాలీవుడ్.. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే ఉంది. దూసుకుపోతున్నప్రపంచంకు ధీటుగా టాలీవుడ్ కూడా ఎంతో విభిన్నంగా ఆలోచిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. తాజాగా 71 వ జాతీయ అవార్డుల (71 National Film Awrds) వేదికపై టాలీవుడ్ మరోసారి తన సత్తా చాటింది. ఏకంగా 7 అవార్డులను కైవసం చేసుకొని తెలుగువారి గర్వాన్ని పెంచేసింది. మరి ఆ 7 అవార్డులు ఏఏ విభాగంలో ఎవరెవరికి వచ్చాయి.. ఎవరెవరు జాతీయ అవార్డును అందుకోబోతున్నారో చూద్దాం.


బెస్ట్ తెలుగు ఫిల్మ్ : భగవంత్ కేసరి

నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి నిర్మించిన ఈ సినిమా 2023 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా శ్రీలీల నటించింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే 'వ‌రంగ‌ల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ భగవంత్‌ కేసరి (బాలకృష్ణ). ఆ జైల‌ర్ శ్రీకాంత్ (శ‌ర‌త్‌కుమార్‌) ఓ ప్రమాదంలో చ‌నిపోతాడు. ఆయనకు జైల‌ర్‌ చేసిన సాయానికి కృతజ్ఞతగా జైలు అధికారి కూతురు అయిన విజ్జి పాప (శ్రీలీల) ను ఆర్మీ ఆఫీసర్‌ చేయాలనుకుంటాడు. ఇంకోపక్క విజ్జీని చంపేందుకు బిజినెస్‌మెన్ రాహుల్ సంఘ్వీ (అర్జున్ రాంపాల్‌) ప్ర‌య‌త్నిస్తుంటాడు? విజ్జీని అత‌డు ఎందుకు చంపాల‌ని అనుకున్నాడు? భగవంత్‌ కేసరి రాహుల్ సంఘ్వీ నుండి విజ్జిని ఎలా కాపాడాడు? విజ్జిని సైన్యంలోకి పంపాలన్న భగవంత్ కేసరి లక్ష్యం నెరవేరిందా? అడ్డంకులను దాటి భగవంత్ కేసరి ఆమెను ఆర్మీ ఆఫీసర్‌ చేయగలిగాడా? అనేదే మిగతా సినిమా కథ. బనావో బేటీకో షేర్ అనే లైన్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు అనిల్.


బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డు మరియు బెస్ట్ ఫిల్మ్: యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్ అవార్డు - హను-మాన్

కుర్ర హీరో తేజా సజ్జ, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. మొట్ట మొదటి సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి మరీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని విజువల్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యిపోయారు. తక్కువ బడ్జెట్ లో అంత క్వాలిటీ విజువల్స్ కు ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు ఈ సినిమా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్ విభాగంలో జాతీయ అవార్డును అందుకుంది. అంతేకాకుండా బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీగా కూడా అవార్డును కైవసం చేసుకుంది.


బెస్ట్ మేల్ సింగర్: ప్రేమిస్తున్నా, రోహిత్ విపిఎస్ఎన్ మరియు బెస్ట్ స్క్రీన్ ప్లే: సాయి రాజేష్ - బేబీ మూవీ

విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలుగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బేబీ. SKN నిర్మించిన ఈ సినిమా 2023 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ టాలీవుడ్ లోనే ట్రెండ్ సెట్టర్ గా మారింది. ముఖ్యంగా వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలోని ప్రేమిస్తున్నా సాంగ్ ఇప్పటికీ బ్రేకప్ అయినవారికి ఫేవరేట్ గా మారిపోయింది. ఆ సాంగ్ పాడిన సింగర్ రోహిత్ విపిఎన్ కే ఉత్తమ జాతీయ సింగర్ అవార్డు వచ్చింది. ఇక బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు సాయి రాజేష్ సొంతం చేసుకున్నాడు.


బెస్ట్ లిరిక్స్: బలగం ఊరు పల్లెటూరు, కాసర్ల శ్యామ్

ఊరు.. పల్లెటూరు అంటూ ఒక్క సాంగ్ తో అన్ని పల్లెటూర్లను ఏకం చేశాడు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు డైరెక్టర్ గా పరిచయం అయిన సినిమా బలగం. దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి ఈ సినిమాను నిర్మించింది. 2023 లో రిలీజ్ అయిన బలగం ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ ఆడించేసింది. ముఖ్యంగా ఆ ఊరు .. పల్లెటూరు సాంగ్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే సాంగ్ లిరిక్స్ కు ఉత్తమ జాతీయ అవార్డు వరించింది.


బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: సుకృతి వేణి బండ్రెడ్డి, గాంధీ తాత చెట్టు

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముద్దుల తనయ సుకృతి వేణి తన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకుంది. ఆమె బాలనటిగా నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఎన్నో అవార్డులను అందుకుంది. రిలీజ్ అయ్యాకా సుకృతి వేణి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ వయస్సులోనే ఆమె నటనను చూసి మెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఈ చిన్నారికి జాతీయ అవార్డు వరించింది.

Updated Date - Aug 01 , 2025 | 08:37 PM