Prabhutva Sarai Dukanam: టీజర్.. ఇంత పచ్చిగా ఉందేంటి! బూతులే.. బూతులు
ABN, Publish Date - Sep 16 , 2025 | 04:36 PM
జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది కాస్త గ్యాప్ తర్వాత రూపొందించిన చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం.
గతంలో 1940లో ఒక గ్రామం (1940 Lo Oka Gramam) సినిమాతో జాతీయ అవార్డు దక్కించుకున్న నరసింహా నంది (Narasimha Nandi) కాస్త గ్యాప్ తర్వాత ఓ షేక్స్ పియర్ స్టోరి ఆధారంగా రూపొందించిన చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం (Prabhutva Sarai Dukanam). మధ్యలో కమలతో నా ప్రయాణం, లజ్జ, డిగ్రీ కాలేజ్, హై స్కూల్ అంటూ పలు సినిమాలు తెరకెక్కించిన ఆయన ఆరేండ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ఎదుటకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీలో పృధ్వీ రాజ్ (Prudhvi Raj), అదితి మైకల్ (Aditi Myakal) జంటగా నటించారు. మంగళవారం ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు.
జంతువుల లక్షణాలు కలిగిన మనుషుల కథ అంటూ అరంభమైన ఈ సినిమా టీజర్ అద్యంతం ఆ తరహాలోనే సాగింది. ఓ గ్రామంలో అమ్మాయిలు అక్కడి పెత్తందార్లను, మొగవాళ్లను ఎదురించి సర్పంచ్ కావాలనే కోరికతో చేసే పనులు, ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది.
అయితే.. సినిమాలో ఆడవాళ్లతో బూతులు, సిగరెట్లు కాల్చడం, ఇంటిమేట్ సన్నివేశాలు ఓ రేంజ్‌లోనే చిత్రీకరించినట్లు తెలుస్తుండగా పదే పదే బూతులు పలికించడం కాస్త ఎబ్బెట్టుగా ఉన్నట్లు ఇంకా చెప్పాలంటే కాస్త ఓవర్ అయినట్లుగా అనిపిస్తోంది. టీజరే ఇలా ఉంటే.. రాబోయే ట్రైలర్.. ఆపై సినిమా ఇంకెంత ఘాటుగా ఉంటుందో అని నెటిజన్లు అనుకుంటున్నారు.