Nara Rohits : అలరించే సుందరకాండ
ABN, Publish Date - Aug 17 , 2025 | 05:56 AM
నారా రోహిత్, విర్తి వాఘని జంటగా నూతన దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన చిత్రం ‘సుందరకాండ’. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బేనర్‌పై సంతోష్ చిన్నపోళ్ల...
నారా రోహిత్, విర్తి వాఘని జంటగా నూతన దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన చిత్రం ‘సుందరకాండ’. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బేనర్‌పై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. సినిమా ఈనెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నారా రోహిత్ మాట్లాడుతూ ‘సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. వినాయక చవితి రోజు కుటుంబమంతా కలసి థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. నటుడు నరేశ్ వీకే మాట్లాడుతూ ‘ఇలాంటి రొమాంటిక్ కామెడీ ఇప్పటి వరకూ రాలేదు. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది’ అని చెప్పారు. దర్శకుడు వెంకటేశ్ మాట్లాడుతూ ‘నా మొదటి సినిమా ఒక డ్రీమ్ మూమెంట్. ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసుకీ, శ్రీదేవి విజయ్ కుమార్, నిర్మాత సంతోష్ తదితరులు పాల్గొన్నారు.