Bhairavam: నారా రోహిత్.. థీమ్ ఆఫ్ వరద లిరికల్ సాంగ్ రిలీజ్
ABN, Publish Date - May 27 , 2025 | 06:22 PM
‘భైరవం’ సినిమా నుంచి నారా రోహిత్ పాత్రకు సంబంధించి సాగే థీమ్ ఆఫ్ వరద పాటను రిలీజ్ చేశారు.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ( Bellamkonda Sai Sreenivas), మంచు మనోజ్ (Manoj Manchu), నారా రోహిత్ (Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భైరవం’ (Bhairavam). విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకుడు. అదితి శంకర్ (Aditi Shankar), దివ్యా పిళ్లై ( Divya Pillai), ఆనంది (Aanandi) కథానాయికలు. మే 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, ట్రైలర్ అదిరి పోయే రెస్పాన్స్ దక్కించుకోగా పాటలు ఒకదాన్ని మించి మరోటి విజయం సాధించి అన్ని మ్యూజిక్ ఫ్లాట్‌ఫాంలలో టాప్‌లో కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. ఇప్పటికే మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రలకు సంబంధించి థీమ్ సాంగ్స్ విడుదల చేసిన మేకర్స్ మంగళవారం సినిమా నుంచి నారా రోహిత్ (Nara Rohith) పాత్రకు సంబంధించి సాగే థీమ్ ఆఫ్ వరద పాటను రిలీజ్ చేశారు. పూర్ణాచారి (Purna Chary) సాహిత్యం అందించిన ఈ పాటకు శ్రీచరణ్ పాకాల (SriCharan Pakala) సంగీతం అందించగా ఫృధ్వీ చంద్ర (Prudhvi Chandra) ఆలపించాడు.