సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nani: నాని సరసన మరోసారి లేడీ పవర్ స్టార్..

ABN, Publish Date - Aug 12 , 2025 | 09:23 PM

న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకొని టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా లవ్ స్టోరీస్ తో మంచి విజయాలను అందుకున్న నాని.. ఇప్పుడు మాస్ హీరోగా మారడానికి కష్టపడుతున్నాడు.

Nani

Nani: న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకొని టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఒకప్పుడు పక్కింటి కుర్రాడిలా లవ్ స్టోరీస్ తో మంచి విజయాలను అందుకున్న నాని.. ఇప్పుడు మాస్ హీరోగా మారడానికి కష్టపడుతున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ (The Paradise) ఒకటి. ఇది కాకుండా మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి శేఖర్ కమ్ముల సినిమా. కుబేర తరువాత శేఖర్ కమ్ముల - నాని కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పటివరకు నాని - శేఖర్ కమ్ముల కాంబోలో ఒక్క సినిమా రాలేదు. ఇక ఇప్పుడు ఈ న్యాచురల్ స్టార్స్ కాంబోలో ఒక సినిమా వస్తుంది అనేసరికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదే విశేషం అనుకుంటే.. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి నటిస్తుందట. అవును.. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. మిడిల్ క్లాస్ అబ్బాయి, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో వీరు నటించారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తున్నారు.


ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్ లో రామాయణ సినిమాలో నటిస్తుంది. రణబీర్ కపూర్ రాముడిగా.. సాయిపల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఫినిష్ అయ్యాకా.. శేఖర్ కమ్ముల సినిమాలో సాయిపల్లవి అడుగుపెడుతుందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఇండస్ట్రీలో ఇదొక మంచి కాంబో అవుతుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

Updated Date - Aug 12 , 2025 | 09:23 PM