The Paradise: నాని సినిమాకు బ్రేకులు.. కారణం ఏంటి.. ?
ABN, Publish Date - Jun 17 , 2025 | 07:59 PM
ఈ ఏడాది హిట్ 3(Hit 3) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం ది ప్యారడైజ్(The Paradise) సినిమాతో బిజీగా మారాడు.
The Paradise: న్యాచురల్ స్టార్ నాని(Natural Star Nani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. మిగతా హీరోల్లా కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకొని.. కొత్త డైరెక్టర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది హిట్ 3(Hit 3) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న నాని.. ప్రస్తుతం ది ప్యారడైజ్(The Paradise) సినిమాతో బిజీగా మారాడు. దసరా సినిమాతో నానికి భారీ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
దసరా అంటేనే రా అండ్ రస్టిక్ సినిమా. ఇక దానికి మించి ప్యారడైజ్ ను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ ఎన్ని రికార్డులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నాని లుక్, ఆ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ లో కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పుడే ప్యారడైజ్ వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 26 న రానుందని మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ ను దృష్టిలో పెట్టుకొనే చిత్రబృందం షూటింగ్ ను ఫినిష్ చేస్తోంది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్యారడైజ్ కు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. నాని కాకుండా మరి కొంతమంది కీలక ఆర్టిస్టుల డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో షూటింగ్ కొద్దిగా వాయిదా పడేలా ఉందని అంటున్నారు. ఇక దీంతో షూటింగ్ ను ఇప్పటికి ఆపేసి తిరిగి జూలై చివరి వారంలో కానీ, ఆగస్టు మొదటి వారంలో మళ్లీ మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారట. అయితే షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడం.. అనుకున్న సమయానికి అవుట్ ఫుట్ అవ్వకపోవడంతో మార్చి నుంచి ప్యారడైజ్ మే కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇలా షూటింగ్ వాయిదా పడుతూ ఉంటే.. మార్చి వరకు సినిమాను ఫినిష్ చేయడం కష్టం. ఒకవేళ అదే కనుక జరిగితే.. హడావిడిగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయడం వలన సినిమా క్వాలిటీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మేకర్స్ గట్టిగా ఆలోచించి కొద్దిగా లేట్ అయినా మంచి అవుట్ ఫుట్ తో రావాలని చూస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
Photo Talk: నటరత్న యన్టీఆర్ నిండు హృదయం