సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Avika Gor: నందు, అవికా గోర్ 'అగ్లీ స్టోరీ'...

ABN, Publish Date - Oct 30 , 2025 | 11:54 AM

నందు, అవికాగోర్ ప్రధాన పాత్రలు పోషించిన అగ్లీ స్టోరీ మూవీ నవంబర్ 21న విడుదల కాబోతోంది. ఈ సిమాను ప్రణవ స్వరూప్ డైరెక్ట్ చేశారు.

Ugly Story Movie

నందు (Nandu), అవికా గోర్ (Avika Gor) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'అగ్లీ స్టోరీ' (Ugly Story). రియా జియా ప్రొడక్షన్స్ పతాకం మీద సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణవ స్వరూప్ దీనికి దర్శకుడు. ఈ చిత్రానికి శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ చేయగా శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించారు. శ్రీకాంత్ పట్నాయక్, మిథున్ సోమ ఎడిటింగ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టైటిల్ గ్లింప్స్‌, టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రం నవంబర్ 21వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర బృందం తెలిపారు. రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా (Shivaji Raja), ప్రజ్ఞా నయన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.


మూవీ రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన సందర్భంగా దర్శకుడు ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ, 'నిర్మాతలు నన్ను, నా కథను నమ్మి ఈ సినిమాని నిర్మించారు. వారు నాకు ఇచ్చిన సహకారంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. టీజర్ క్లైమాక్స్ లో నందు చెప్పిన డైలాగ్ ఇమేజినేషన్లో ఉన్న ప్రేమ రియల్ లైఫ్ లో ఉండదు అనే డైలాగ్ కి చాలా మంచి స్పందన లభిస్తోంది. ఇలాంటి డైలాగులు యూత్ ని ఆకట్టుకునే విధంగా ఇంకా ఎన్నో సినిమాలో ఉండబోతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పగలను' అని అన్నారు.

Also Read: Ramayana: 'రామాయణ్‌’ ట్రోలింగ్‌పై సద్గురు స్పందన..

Also Read: Abhishek Bachchan: రక్త, స్వేదం చిందించటం.. కన్నీళ్లే నాకు తెలుసు

Updated Date - Oct 30 , 2025 | 12:28 PM