Nandamuri Padmaja: ఎన్టీఆర్ పెద్ద కోడలు మృతి..
ABN, Publish Date - Aug 19 , 2025 | 11:00 AM
నందమూరి కుటుంబంలో (Nandamuri Family) విషాదం చోటు చేసుకుంది.
నందమూరి కుటుంబంలో (Nandamuri Family) విషాదం చోటు చేసుకుంది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పెద్ద కోడలు, జయకృష్ణ సతీమణి పద్మజ (Nandamuri Padmaja) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన చెల్లెలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ నుండి దగ్గుబాటి పురందేశ్వరి ఈరోజు మధాహ్ననికి హైద్రాబాద్ కి చేరుకోనున్నారు. పద్మజ మరణంతో నందమూరి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.