Nandamuri Balakrishna: టాలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా.. బాలయ్య దిగితే దబిడిదిబిడే
ABN, Publish Date - Nov 14 , 2025 | 09:36 PM
నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా అఖండ-2- తాండవం (Akhanda 2 Thaandavam) వెలుగు చూడనుంది.
Nandamuri Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా అఖండ-2- తాండవం (Akhanda 2 Thaandavam) వెలుగు చూడనుంది. గతంలో బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన 'సింహా, లెజెండ్, అఖండ' చిత్రాలన్నీ సౌత్ ను షేక్ చేశాయి. అందువల్ల వారి కాంబోలో వస్తోన్న నాలుగో చిత్రం అఖండ-2- తాండవంను పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. థమన్ బాణీల్లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత వారం 'అఖండ-2' ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ప్రోమో రిలీజయింది. అప్పటి నుంచీ ఫ్యాన్స్ ఫస్ట్ సింగిల్ ను చూసేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు... ఈ నేపథ్యంలోనే 'అఖండ-2'లోని ఫస్ట్ సింగిల్ ను ముంబైలో ఆవిష్కరించడం విశేషంగా మారింది.
ఇక ఈ సాంగ్ ఈవెంట్ లో బాలయ్య హిందీలో అదరగొట్టాడు. ఆయన మాట్లాడుతూ.. ' నాకు ధన్యమైన జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు ముందుగా ప్రణామాలు. వారి ఆశీర్వాదంతోనే నేను ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాను. మా నాన్నగారి అడుగుజాడల్లో ముందుకు వెళుతున్నాను. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నాను. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతోమందికి ఉచితవైద్యం అందించడం జరుగుతోంది. ఇంతమంది అభిమానుల్ని పొందడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కథానాయకుడిగా ఉన్నాను. సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా డిక్షనరీలో లేదు. నా తండ్రి దైవాంశ సంభూతుడు.. ఆయన దగ్గర నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే .. హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమం అఖండ2లో సినిమాలో చూస్తారు.
ధర్మంగా బ్రతకండి .. సత్యం మాట్లాడండి.. అన్యాయానికి తలవంచకండి.. ఇది అఖండ తాండవం కథ. బోయపాటి గారితో మూడు సినిమాలు చేశాం. సింహ లెజెండ్ అఖండ.. మూడు హ్యట్రిక్స్. ఇది నాలుగో సినిమా. బోయపాటి గారు నేను ఒకటే వేవ్ లెంత్ లో వర్క్ చేస్తాం. తమన్ తో అఖండ, వీరసింహారెడ్డి, నేలకొండ భగవంత కేసరి, డాకు మహారాజ్ నాలుగు సినిమాలు చేశాను ఇప్పుడు అఖండ2 ఐదవది. మాది అద్భుతమైన కాంబినేషన్. కైలాష్ ఖేర్ గారు, శంకర్ మహదేవన్ గారు హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ పాటని ఎంతో అద్భుతంగా ఆలపించారు. ప్రతిఒక్కరు తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమాని చూపించాలి. మన హిందూ సనాతన ధర్మం ఏమిటో చెప్పాలి.
బజరంగ్ భాయిజాన్ తర్వాత హర్షాలి ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో తనది చాలా కీలకమైన పాత్ర. ఆది పినిశెట్టి అద్భుతమైన నటుడు. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. వారి నాన్నగారు రవిరాజా పినిశెట్టి. ఎంతో గొప్ప దర్శకుడు. ఇక మా నిర్మాతలు ఆచంట రామ్ గారు గోపి గారి నిర్మాణంలో నాకు ఇది రెండో సినిమా. చాలా మంచి సినిమాలు తీయాలి.. ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేయాలని తపనతో ఉండే ప్రొడ్యూసర్స్ వారు. అఖండ 2 తో మంచి సినిమా నిర్మించారు. జార్జియా, మధ్యప్రదేశ్ ఇలా చాలా అద్భుతమైన లొకేషన్స్ లో షూట్ చేసిన సినిమా ఇది. సినిమాని ప్రజెంట్ చేస్తున్న నందమూరి తేజస్విని మా అమ్మాయి. నేను హోస్టుగా చేసిన అన్ స్టాపబుల్ ఇండియాలో నెంబర్ వన్ షో. ఆ షోకి మా అమ్మాయి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేసింది. ఈ సినిమా కోసం కూడా చాలా కష్టపడింది. ఇక అఖండ2 చాలా అద్భుతమైన సినిమా. డిసెంబర్ 5న మీ ముందుకు వస్తుంది. ముంబై ఈవెంట్ లో ఈ సాంగ్ ని లాంచ్ చేయడం ఇక్కడి నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది.' అంటూ ముగించారు. మొత్తం స్పీచ్ హిందీలో మాట్లాడడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ అయినా.. బాలీవుడ్ అయినా బాలయ్య దిగనంత వరకే.. ఒక్కసారి ఆయన దిగాడంటే దబిడి దిబిడే అని నెటిజన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి అఖండ 2 తో బాలయ్య - బోయపాటి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.