NBK111: బాలయ్య.. మహారాజు షురూ! ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
ABN, Publish Date - Nov 26 , 2025 | 11:29 AM
వీరసింహా రెడ్డి వంటి బడా బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రెండవ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
వీరసింహా రెడ్డి వంటి బడా బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) కాంబోలో రెండవ చిత్రం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య 111 (NBK111) వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో నయనతార (Nayanthara) కథానాయికగా నటిస్తోండగా సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతుండడం విశేషం. రామ్ చరణ్‌తో పెద్ది సినిమాను రూపొందిస్తున్న వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) పతాకంపై వెంకట సతీశ్ కిలారు (venkata Satish kilaru) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు సీనియర్ దర్శకుడు బి.గోపాల్ క్లాప్ ఇవ్వగా, బాలకృష్ణ కూతురు తేజస్వి కెమెరా స్విచ్చాన్ చేసింది. ఆపై ఫస్ట్ షాట్‌కు బోయపాటి, బాబీ, బుచ్చిబాబు గౌరవ దర్శకత్వం వహించారు. కాగా డిసెంబరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలాఉంటే.. బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అంతేకాదు సినిమా థీమ్‌ను ఉద్దేశించి బాలయ్య క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ ప్రత్యేకంగా తయారు చేయించిన పోస్టర్లు ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా ఇంకా రేంజ్‌లో ఉండబోతుందో అని అప్పుడు అంచనాలు స్టార్ట్ అవుతున్నాయి. కాగా ఈ చిత్రానికి మహా రాజు అనే టైటిల్ పరిశీలనలో ఉంది.