సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nandamuri Balakrishna: అభిమానిపై రెచ్చిపోయిన బాలయ్య.. వీడిని వెళ్లగొట్టండి అంటూ ఫైర్

ABN, Publish Date - Nov 18 , 2025 | 07:22 PM

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోపం గురించి అయితే నందమూరి ఫ్యాన్స్ కు అస్సలు చెప్పక్కర్లేదు.

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోపం గురించి అయితే నందమూరి ఫ్యాన్స్ కు అస్సలు చెప్పక్కర్లేదు. బాలయ్య,కు కోపం వస్తే ప్లేస్ ఏంటి.. ? ఎదురుగా ఉన్నది ఎవరు.. ? అనేది ఏమి చూడడు. చేతిలో ఏది ఉంటే దాన్ని విసరడమే. లేకపోతే అందినవాడి చెంప పగలకొట్టడమే. అయితే బాలయ్యకు ఎందుకు కోపం వచ్చింది అనేది ఎవరు పట్టించుకోరు.. కానీ, ఆయన కోపం గురించి ట్రోల్స్ వేస్తుంటారు. ఎన్ని దెబ్బలు తిన్నా అభిమానులు మాత్రం బాలయ్య బంగారం అంటారు.

తాజాగా అఖండ 2 సాంగ్ లాంచ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ కోసం వైజాగ్ వెళ్లిన బాలయ్యకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా మహిళలు రోజా పువ్వులతో బాలయ్యకు స్వాగతం పలికారు. ఇక ఆయన కూడా ఎంతో గౌరవంగా వారిని పలకరించాడు. ఇక సడెన్ గా బాలయ్య.. ఒక అభిమానిపై విరుచుకు పడ్డాడు. వీడెందుకు వచ్చాడు, వెళ్ళగొట్టండి.. అంటూ ఫైర్ అయ్యాడు. అంతేకాకుండా సెక్యూరిటీపై కూడా అరిచాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ఈ వీడియోపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. బాలయ్య మారాడు.. ఎప్పుడు ఎవరో ఒకరిని తిట్టడం, కొట్టడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ, నందమూరి ఫ్యాన్స్ మాత్రం నిజాలు తెలుసుకొని మాట్లాడండి. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా.. మహిళలు.. బాలయ్యతో మాట్లాడుతుంటే.. వెనుక ఉన్న ఒక మగ అభిమాని.. మహిళలను తోసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నించాడు. దీంతో మహిళలు ఇబ్బందిపడడం చూసిన బాలయ్య అతడిపై అరిచాడు. అంతకు ముందు కూడా అతను ఇలానే చేశాడని,అందుకే వీడు మళ్లీ ఎందుకు వచ్చాడు.. సాయంత్రం ఈవెంట్ లో వీడు కనిపించకూడదు అని అన్నట్లు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Nov 18 , 2025 | 07:22 PM