Nagavamsi: కేవీఎన్ ప్రొడక్షన్స్ తో నాగవంశీ డీల్
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:56 PM
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ కు టైం భలే కలిసివస్తోంది. క్రేజీ మూవీలన్నీ తన చేతికే చిక్కుతున్నాయి. పక్క ఇండస్ట్రీల నుంచి రాబోతున్న భారీ మూవీలకు సోలో ఓనర్ తానే కాబోతున్నాడు.. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా..
యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో దూకుడుగా దూసుకెళ్తున్నాడు. కొన్నాళ్లుగా భారీ సినిమాలను ఫ్యాన్సీ రేట్లకు కొంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'దేవర', 'వార్ 2', 'లోకా ఛాప్టర్ 1' వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. తాజాగా ఈ యంగ్ ప్రొడ్యూసర్ మరో ఆసక్తికరమైన అడుగేశాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌తో తెలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్‌పై ఒప్పందం చేసుకున్నాడు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ వివిధ భాషల్లో పెద్ద ఎత్తున సినిమాలు తీసేందుకు సిద్ధమవుతోంది. తాజా ఒప్పందంతో నాగ వంశీ వాటిని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మొదటి సినిమానే క్రేజీ ప్రాజెక్టును దక్కించుకున్నాడు. దళపతి విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' ను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
నాగ వంశీ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను రూ. 9 కోట్లకు రీఫండబుల్ బేసిస్‌పై చేజిక్కించుకున్నాడు. ఇవే కాదు.. వరుస ప్రాజెక్టులు ఆయనకు దక్కబోతున్నాయి. కేవీఎన్ నుంచి వస్తున్న అప్‌కమింగ్ సినిమా 'టాక్సిక్'ను కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేది కూడా నాగవంశీనే కావడం విశేషం. 'కేజీయఫ్' ఫేమ్ యష్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు నాగ వంశీ రైట్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత జన నాయగన్‌కు మంచి బజ్ వచ్చినట్టయింది. మొత్తానికి నాగవంశీ టైమ్ బాగుంటే..భారీగా వెనకేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట.
Read Also: Ajay Bhupathi: జయకృష్ణ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం
Read Also: RGV: బాలకృష్ణ సినిమాలు చూడను.. చిరంజీవితో సినిమా చేయడం చేతకాదు