Kedi KIan Kumar: బ్రేకింగ్.. ఇండస్ట్రీలో విషాదం! ప్రముఖ టాలీవుడ్.. దర్శకుడు హఠాన్మరణం
ABN, Publish Date - Dec 17 , 2025 | 12:26 PM
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కేకేగా గుర్తింపు ఉన్న కె. కిరణ్ కుమార్ (Kiran Kumar) హాఠాన్మరణం చెందారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కేకేగా గుర్తింపు పొందిన కె. కిరణ్ కుమార్ (Kiran Kumar) హాఠాన్మరణం చెందారు. స్టమక్ ఇన్ఫెక్షన్‌తో.. ఇటీవల హస్పిటల్‌లో చేరిన ఆయనకు శస్త్ర చికిత్స చేయగా అది కాస్త విఫలం అవడంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడని సినిమా వర్గాల్లో సమాచారం. ఈ విషయమై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
2010లో నాగార్జున హీరోగా వచ్చిన కేడీ (Kedi) సినిమాకు కిరణ్ దర్శకత్వం వహించాడు. ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో తెరమరుగయ్యారు. తిరిగి 15 ఏండ్ల తర్వాత ఆయన రీ ఎంట్రీ ఇస్తూ కేజేక్యూ (KJQ) అనే చిత్రాన్ని రూపొందించగా అది త్వరలో విడుదలకు ముస్తాబయింది. ఈ క్రమంలో మూడు నాలుగు నెలల క్రితం మీడియా సమావేశం సైతం నిర్వహించి ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చాడు.
అయితే.. ఇటీవల ఆయన విజయ్ అంటోని హీరోగా వచ్చిన భద్రకాళి సినిమాలో సీబీఐ అఫీసర్‌గా కీలక పాత్రలో నటించడం విశేషం. ఇదిలాఉంటే..అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో దేశాన్ని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), నానితో దసరా వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల వంటి డైరెక్టర్లు గతంలో కిరణ్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేయడం విశేషం.