సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

King 100: నాగార్జున 100వ సినిమా.. హీరోయిన్లుగా ట‌బు, అనుష్క‌! మ‌ధ్య‌లో ఆ భామ‌

ABN, Publish Date - Oct 17 , 2025 | 11:56 AM

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌ ప్రాజెక్ట్ 100వ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు.

King 100

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌ ప్రాజెక్ట్ 100వ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి టాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి లాటరీ కింగ్ (Lottery King) అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోండ‌గా నాగ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.

ఇక కింగ్ 100గా వ‌స్తున్న‌ ఈ సినిమా గురించి మరో పెద్ద అప్‌డేట్ ఏమిటంటే.. ఇప్ప‌టికే ఈ సినిమాలో ఓ క‌థానాయిక‌గా టబు (Tabu) న‌టిస్తోంద‌ని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాపై అంద‌రి దృష్టి ప‌డింది. గ‌తంలో ట‌బు నాగార్జున ఇరువురు నిన్నే పెళ్లాడ‌తా, ఆవిడా మా ఆవిడే స‌నిమాల‌తో హిట్ ఫెయిర్‌గా పేరు ద‌క్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ వార్త‌ల‌ను మ‌రింత‌గా బూస్ట్ ఇస్తూ మ‌రో అగ్ర నాయిక అనుష్క షెట్టి (Anushka Shetty) సైతం ఈ చిత్రంలో న‌టించ‌నున్న‌ట్లు తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి.

అనుష్క షెట్టి (Anushka Shetty) సినిమా కెరీర్ నాగార్జున సూప‌ర్ సినిమాతోనే మొద‌ల‌వ‌గా ఆ త‌ర్వాత డ‌మ‌రుకం, ర‌గ‌డ‌, సొగ్గాడే చిన్ని నాయ‌న‌, ఊపిరి సినిమాల్లోనూ న‌టించి బెస్ట్ జంట‌గా పేరు గ‌డించింది. ఇలా ఇప్పుడు నాగార్జున త‌న‌కు అచ్చి వ‌చ్చిన ఇద్ద‌రు హీరోయిన్లతో స్క్రీన్‌పై కనిపించబోతుందన్న వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో అక్కినేని ఫ్యాన్స్‌లో కొత్త‌ ఉత్సాహం నెల‌కొంది. అయితే.. అందుతున్న తాజాగా స‌మాచారం ప్ర‌కారం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ట‌బు ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటే ఆ స్థానంలో క‌థానాయిక‌గా న‌య‌న‌తార‌ను తీసుకున్న‌ట్లు వార్త‌లు సైతం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలాఉంటే.. తమిళ దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik). ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతుండ‌గా కొత్తదనంతో కూడిన కథ , ప్రెజెంటేషన్ స్టైల్ విభిన్నంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. నాగ్ 100వ సినిమా కావడంతో, ప్రతి అంశంలోనూ ప్రత్యేకత చూపించాలనే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన, ఇత‌ర అన్ని వివ‌రాలు త్వరలో వెలువడే అవకాశముందని, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Oct 17 , 2025 | 11:56 AM