Kalivi Vanam: నాగదుర్గ హీరోయిన్‌గా తొలి చిత్రం.. ‘కలివి వనం’ ట్రైలర్
ABN, Publish Date - Nov 10 , 2025 | 06:12 AM
వనాలను రక్షించుకోవాలనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘కలివి వనం’ చిత్రం ట్రైలర్ విడుదలైంది.
వనాలను రక్షించుకోవాలనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘కలివి వనం’(Kalivi Vanam). ఫోక్ స్టార్ నాగదుర్గ (Nagadurga) లీడ్ రోల్‌లో నటించగా రఘుబాబు (Raghu Babu), సమ్మెట గాంధీ ప్రధాన తారాగణం. రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి నిర్మించారు. వనజీవి రామయ్య స్ఫూర్తితో చెట్లను పెంచాలి, ఆడవులను కాపాడుకోవాలనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందింది.
ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి ఆదరణను దక్కించుకోగా తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసి, రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈనెల 21న ‘కలివి వనం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.వినోదంతో పాటు విజ్ఞానాన్ని ఇచ్చే చిత్రమిదని దర్శకుడు తెలిపారు.