Nagababu: నీకేం హక్కుంది.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి
ABN, Publish Date - Dec 27 , 2025 | 12:05 PM
ఇటీవల దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా శివాజీ హీరోయున్ల అందాల ప్రదర్శణలపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇటీవల దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా శివాజీ హీరోయున్ల అందాల ప్రదర్శణలపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది జరిగి వారం గడుస్తున్నానా సమస్య మాత్రం అంతకంతకు పెరుగుతుంది తప్పితే ఎక్కడా తగ్గే సూచనలు కనబడడం లేదు.
ఇప్పటికే చిన్మయి, అనసూయ వంటి వారు శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అవడం మహిళా కమీషన్ వరకు ఇష్యూ వెళ్లడం అవెంటనే శివాజీ (Actor Shivaji) సైతం స్వయంగా ముందుకు వచ్చి అసభ్య పదజాలం వాడినందుకు క్షమాపణలు సైతం చెప్పారు.
దాంతో ఈ వివాదం ఇక సద్దుమణిగందనే సమయానికి సమస్య కాస్త శివాజీ వర్సెస్ అనసూయ అన్నట్లుగా మారండం, నిత్యం మీడియా ఆ వార్తలనే హైలెట్ చేస్తూ సంస్యను వెలుగులోనే ఉండనిస్తున్నారు. అయితే తాజాగా.. ఈ వివాదం ఇలా సాగుతుండగానే ఇప్పుడు మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు (Naga Babu Konidela) నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు, వివాదంపై స్పందించి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.
ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో అది వారి ఇష్టమని వారిని ఆక్షేపించడానికి మనం ఎవరం. ఇంకా ఎన్నాళ్లు ఆడవారిపై మగవారు ఇలాంటి వివక్షలు కొనసాగిస్తారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని తీవ్రంగా శిక్షించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి నాగబాబు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.