సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nagababu: నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశాం.. మాదే తప్పు 

ABN, Publish Date - Jun 21 , 2025 | 03:06 PM

మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు.

Nagababu

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. ఇక చాలా రేర్ గా యూట్యూబ్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చే నాగబాబు తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన  పిల్లల గురించి మాట్లాడాడు. నాగబాబుకు  కొడుకు వరుణ్ తేజ్(Varun Tej), కూతురు  నిహారిక(Niharika)  ఉన్నారు. ముకుంద సినిమాతో వరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మంచి  వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుణ్ తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు.  ఏడాది క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న వరుణ్  కొన్నేళ్లుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్  ఒక కొరియన్ హర్రర్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. 


నిహారిక కొణిదెల.. మెగా కాంపౌండ్ నుంచి  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక వారసురాలు. ఒక మనసు సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమైంది.  అయితే మొదటి సినిమాతోనే విమర్శలు అందుకున్న నిహారికఆ తరువాత పలు సినిమాల్లో నటించినా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.  అయితే ట్రోలింగ్ గురవుతుంది అనుకున్నారో.. లేక విజయం అందుకోదేమో అనుకున్నారో తెలియదు కానీ, మెగా ఫ్యామిలీ నిహారికకు పెళ్లి చేసేసింది.  చిరంజీవి ఫ్రెండ్ కొడుకు అయిన జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 


నిహారిక - చైతన్య కలకాలం కలిసి ఉంటారు అనుకున్న మెగా ఫ్యాన్స్ కు నిరాశ ఎదురయ్యింది. ఆ జంట విభేదాల వలన విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో నిహారిక మరోసారి ట్రోలింగ్ కు గురైంది. కావాలనే నిహారిక అత్తవారింటిని వదిలేసి వచ్చిందని, పబ్  వివాదం ఆ జంటను వేరు చేసిందని రకరకాలుగా వార్తలు పుట్టుకొచ్చాయి. ఇలాంటివేమీ పట్టించుకోని నిహారిక ప్రస్తుతం నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే గద్దర్ అవార్డును సొంతం చేసుకుంది. 


తాజాగా నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి గురించి మాట్లాడుతూ ..' నిహారిక పెళ్లి విషయంలో మేము పొరపాటు చేసాం. మేము వారిని ప్రోపర్ గా జడ్జ్ చేయలేకపోయాము. వారికి సింక్ అవ్వలేదు. మ్యూచువల్ గా ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం తను ప్రొడక్షన్ హౌస్ స్థాపించి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. ఏదో ఒకరోజు తను వేరొక అబ్బాయిని కలుస్తుంది. పెళ్లి చేసుకుంటుంది. అంతే. ఈసారి మాత్రమే కాదు నేనెప్పుడూ కూడా పిల్లల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోలేదు.


నిహారిక పెళ్లి.. అబ్బాయిని చూపించింది మేమే తప్ప.. ఆమె మద్దతుతో మేము చేయలేదు. మేము చెప్పాము.. ఓకే అన్నట్లు అంతే. ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది కానీ, అది తన స్వంత ఇష్టం కాదు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారు.. వారు జీవితాంతం  కలిసి ఉండాలా వద్దా అనేది వాళ్ల జడ్జిమెంట్. వాళ్లు వద్దనుకున్నారు.. విడిపోయారు. నేనెప్పుడూ వారి మధ్య సిమెంట్ వెయ్యడం  కానీ, నిప్పు అంటించడం కానీ చేయలేదు. చేయను కూడా. నిహారికకు అడిగాను. ఆమె విడిపోతాను అంది. ఓకే అని చెప్పాను. మర్యాదపూర్వకంగానే విడిపోయారు. ఇప్పుడు తను తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది' అని చెప్పుకొచ్చాడు.

Ustad: నిర్మాతగా రామ్ పోతినేని...

Updated Date - Jun 21 , 2025 | 03:06 PM